తల్లి ప్రేమంటే ఇదే.. పిల్లల చదువు కోసం మంగళసూత్రాన్ని..

సృష్టిలో తల్లి ప్రేమను మించింది మరొకటి ఉండదు. తన పిల్లల్ని ఎవరి ముందు కూడా తలవంచుకుండా చూసేలా ప్రయత్నిస్తుంది. అందరికంటే తన పిల్లలే గొప్ప వారిగా తయారు కావాలని భావిస్తుంది. అది తల్లి..

తల్లి ప్రేమంటే ఇదే.. పిల్లల చదువు కోసం మంగళసూత్రాన్ని..

Edited By:

Updated on: Aug 01, 2020 | 11:34 PM

సృష్టిలో తల్లి ప్రేమను మించింది మరొకటి ఉండదు. తన పిల్లల్ని ఎవరి ముందు కూడా తలవంచుకుండా చూసేలా ప్రయత్నిస్తుంది. అందరికంటే తన పిల్లలే గొప్ప వారిగా తయారు కావాలని భావిస్తుంది. అది తల్లి సహజ లక్షణం. కర్ణాటకలో ఓ తల్లి ప్రేమను చూస్తే అది స్పష్టమవుతుంది. రాష్ట్రంలోని గడక్‌ జిల్లాలో ఓ తల్లి తన పిల్లల చదువు కోసం.. తన మంగళసూత్రాన్ని తనఖా పెట్టింది. ఆగస్టు మాసం ప్రారంభమైనప్పటికీ. స్కూళ్లు ఇంకా తెరవలేదు. అయితే ఆన్‌లైన్ తరగతులతో పాటు.. పలు న్యూస్‌ ఛానెల్స్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించాలని నిర్ణాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ, స్మార్ట్‌ ఫోన్, ఇంటర్నెట్ తప్పనిసరి అవుతుంది. అయితే సామాన్య కుటుంబంలో ఇంకా ఎంతో మంది ఇళ్లల్లో టీవీలు లేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో టీవీని ఖచ్చితంగా కొంటున్నారు. అయితే గడక్‌ జిల్లాకు చెందిన ఓ తల్లి.. తన పిల్లలు చదువుకోవాలంటే టీవీ తప్పనిసరి అని భావించి.. తన మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టి టీవీ కొన్నది. ఈ విషయం పొరుగువారికి తెలియడం.. ఆ తర్వాత అందరినోటా విషయం బయటపడి వైరల్ అవ్వడంతో ఈ ఘటనపై ప్రభుత్వం వరకు చేరింది.

Read more

ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు

రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. జవాన్‌ వీరమరణం

ఢిల్లీలో కేసుల కంటే పెరిగిన రికవరీలు

Follow Us