నకిలీ నోట్ల దందా తాజాగా ఏపీలో అలజడి రేపింది. ఈ రోజు కర్నాటకలోనూ ఫేక్ నోట్స్ దందా కలకలం రేపుతోంది. దొంగనోట్ల చెలమణీని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా విచ్చలవిడిగా దందా కొనసాగిస్తూనే ఉంది దొంగనోట్ల ముఠా. తాజాగా కర్నాటకలోని నంటూరులో ఫేక్ కరెన్సీని తరలిస్తోన్న ముఠా గుట్టు రట్టుచేశారు పోలీసులు. నంటూరులో నకిలీ నోట్లను తరలిస్తున్న నిజాముద్దీన్, రజీమ్ అనే ఇద్దరు యువకులను అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన డానియల్ నుంచి నాలుగున్నర లక్షల నకిలీ 500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
బంట్వాళ బి.సి.రోడ్డుకు చెందిన నిజాముద్దీన్, మంగళూరులో నివాసముంటున్న రజీమ్ యానె రఫీ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఈఫేక్ కరెన్సీ దందాని గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగిస్తున్నారు వీళ్ళిద్దరూ. మంగళూరులోని కద్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని…నంతూరు సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులకు దొరికిపోయారు నిందితులు. పోలీసులనుంచి తప్పించుకునేందుకు స్పీడ్‌గా దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే వీరిని వెంటపడి పట్టుకున్న పోలీసులు… తనిఖీలు నిర్వహించగా అసలు విషయం బట్టబయలయ్యింది. వీరిద్దరి వద్ద నుంచి రూ 4.5 లక్షల.. రూ 500 రూపాయల నకిలీ నోట్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Mangaluru, K’taka | 2 accused, Nizamuddin & Razim, detained & Rs4.5 lakhs counterfeit notes of Rs500 denomination & a robbed vehicle seized under Kadri PS. Both accused have past cases registered against them. Accused Nizamuddin has 5 cases incl 2 murder cases against him:CP(3.1) pic.twitter.com/sOIH1xwtir
— ANI (@ANI) January 3, 2023
ఈ ఫేక్ నోట్ల విషయంపై ఆరాతీయగా…బెంగళూరు నివాసి డేనియల్ నుంచి నకిలీ కరెన్సీ నోట్లు అందాయని, వాటిని చెలామణిలో పెట్టేందుకు వెళ్తున్నట్టు నిందితులు వెల్లడించారు. ఇదిలా ఉండగా…పాండేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు… ఓ వ్యక్తిపై దాడి చేసి, అతడి స్కూటర్‌ని లాక్కెళ్లారు. ఆ తర్వాత అదే వాహనంలో నకిలీ నోట్లను రవాణా చేస్తున్నట్టు మంగళూరు పోలీసు గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..