కన్నీరు పెట్టుకున్న కర్నాటక స్పీకర్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మ‌ృతిపై కర్నాటక శాసనసభ స్పీకర్ రమేశ్‌కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్ మరణవార్త విన్న వెంటనే ఆయన తన దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు.ఆయనతో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధముందని, తనకు జైపాల్ గురువుతో సమానమంటూ కన్నీరు పెట్టుకున్నారు. 1980 నుంచి జైపాల్‌రెడ్డి తెలుసునని, తనకు అన్నగా భావించేవాడినంటూ చెప్పుకుని బాధపడ్డారు. గొప్ప మనసున్న వ్యక్తి అని, జైపాల్ వంటి గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా […]

కన్నీరు పెట్టుకున్న కర్నాటక స్పీకర్

Edited By:

Updated on: Jul 28, 2019 | 5:31 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మ‌ృతిపై కర్నాటక శాసనసభ స్పీకర్ రమేశ్‌కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్ మరణవార్త విన్న వెంటనే ఆయన తన దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు.ఆయనతో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధముందని, తనకు జైపాల్ గురువుతో సమానమంటూ కన్నీరు పెట్టుకున్నారు. 1980 నుంచి జైపాల్‌రెడ్డి తెలుసునని, తనకు అన్నగా భావించేవాడినంటూ చెప్పుకుని బాధపడ్డారు. గొప్ప మనసున్న వ్యక్తి అని, జైపాల్ వంటి గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని స్పీకర్ రమేశ్ కుమార్ చెప్పారు.

ఆయన మరణ వార్తను వినడంతో తనకు ఇదొక విషాదకరమైన రోజు అని వ్యాఖ్యానించారు రమేశ్. జైపాల్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్నిగుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకోవడం అందరినీ కలచివేసింది.