ముంబైలో ఆగని వానలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎమ్‌డీ అధికారులు

ముంబైలో వానలు దంచికొడుతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటిముగినిపోయాయి. ఆదివారం తెల్లవారు జామున కురిసిన వానలతో థానే జిల్లాలో పలు గ్రామాలు నీటమునిగాయి. ఇక రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున రెడ్ అలర్ట్ ప్రకటించారు. . గడచిన 24 గంటల్లో కొలాబా, శాంటాక్రూజ్ ప్రాంతాల్లో గరిష్టంగా 44.2. మిల్లీమీట్లర్లు కనిష్టంగా 27.7 మిల్లీమీటర్లు నమోదైంది. మహారాష్ట్రలో రాష్ట్రం మొత్తం ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు విధర్భ, మరట్వాడా […]

ముంబైలో ఆగని వానలు..  రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎమ్‌డీ అధికారులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 28, 2019 | 5:00 PM

ముంబైలో వానలు దంచికొడుతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటిముగినిపోయాయి. ఆదివారం తెల్లవారు జామున కురిసిన వానలతో థానే జిల్లాలో పలు గ్రామాలు నీటమునిగాయి. ఇక రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున రెడ్ అలర్ట్ ప్రకటించారు. . గడచిన 24 గంటల్లో కొలాబా, శాంటాక్రూజ్ ప్రాంతాల్లో గరిష్టంగా 44.2. మిల్లీమీట్లర్లు కనిష్టంగా 27.7 మిల్లీమీటర్లు నమోదైంది.

మహారాష్ట్రలో రాష్ట్రం మొత్తం ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు విధర్భ, మరట్వాడా ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్టుగా వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఆదివారం తెల్లవారు జామున కురిసిన వర్షంతో ఉల్హాస్ నది పొంగిపొర్లడంతో రాత్యా గ్రామంతో సహా పలు ప్రాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నట్టుగా అధికారులు తెలిపారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ముంబైలో జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది.

రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ఉద్యోగులు, పనులకు వెళ్లే సాధారణ ప్రజలు, స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు, విద్యార్ధులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు జాతీయ రహదారులపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు కదిలేందుకు కొన్ని గంటల సమయం పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.