కంగనా రనౌత్ ఫై కేసు పెట్టిన కర్నాటక పోలీసులు

| Edited By: Pardhasaradhi Peri

Oct 13, 2020 | 4:12 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కర్నాటక పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నవారిని ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ  ఆమె లోగడ ట్వీట్ చేసింది. దీంతో ఆమెపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నాయక్ అనే వ్యక్తి తుమకూరు కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని స్వీకరించిన కోర్టు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. సీఏఏ ను వ్యతిరేకించినవారు, ఈ నిరసనకారులు కూడా […]

కంగనా రనౌత్ ఫై కేసు పెట్టిన కర్నాటక పోలీసులు
Follow us on

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కర్నాటక పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నవారిని ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ  ఆమె లోగడ ట్వీట్ చేసింది. దీంతో ఆమెపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నాయక్ అనే వ్యక్తి తుమకూరు కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని స్వీకరించిన కోర్టు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. సీఏఏ ను వ్యతిరేకించినవారు, ఈ నిరసనకారులు కూడా టెర్రరిస్టులతో సమానమే అని కంగనా ఆ మధ్య తీవ్రంగా విమర్శించింది.