Watch Video: దెయ్యం వదిలిస్తామని 4 గంటలు మహిళకు నరకం.. దెబ్బలు తాళలేక చివరకు..! వీడియో వైరల్

ఓవైపు సమాజం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే గ్రామాల్లోని ప్రజల మూఢనమ్మకాల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. చేతబడి, బాణామతి, చిల్లంగి వంటి క్షద్రపూజల పేరుతో పలు ప్రాంతాల్లో అమాయకుల జీవితాలతో మోసగాళ్లు ఆడుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో దెయ్యం పట్టిందని ఓ మహిళను కొట్టి చంపారు. ఇదంతా కొడుకు చూస్తుండగా జరిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు మృతురాలి కొడుకుతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Watch Video: దెయ్యం వదిలిస్తామని 4 గంటలు మహిళకు నరకం.. దెబ్బలు తాళలేక చివరకు..! వీడియో వైరల్
Exorcism Ritual

Updated on: Jul 10, 2025 | 11:04 AM

శివమొగ్గ, జులై 10: కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా హోసా జంబ్రఘట్ట గ్రామానికి చెందిన గీతమ్మ (55) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె దూరపు చుట్టం ఆశ వారి ఇంటికి వెళ్లి గీతమ్మను దుష్టశక్తులు ఆవహించాయని, వెంటనే భూతవైద్యం చేయించాలని చెప్పింది. దాంతో గీతమ్మ కుమారుడు బూత వైద్యం చేసే దంపతుల దగ్గరికి సోమవారం రాత్రం 9.30 గంటల ప్రాంతంలో ఆమెను తీసుకెళ్లాడు. వాళ్లు దెయ్యాన్ని వదిలించే నెపంతో సోమవారం రాత్రి 9.30 గంటల నుంచి 1.30 గంటల వరకు నాలుగు గంటలపాటు చిత్రవధ చేశారు. తొలుత గీతమ్మ తలపై పెద్ద రాయితో మోదారు. అనంతరం ఆమె శరీరంపై చల్లని నీరు పోసి.. చేతులతో, కర్రలతో తీవ్రంగా కొట్టారు. దాహంగా ఉందని కాసిన్ని నీళ్లు ఇవ్వమని అడిగినా ఎవ్వరూ ఇవ్వకపోగా.. మరింత రెచ్చిపోయి చిత్రహింసలు పెట్టారు.

దీంతో దెబ్బలకు తాళలేక గీతమ్మ స్పృహ కోల్పోయింది. అనంతరం ఆశా ఆమెలోని ఆత్మను తొలగించినట్లు తెలిపింది. దీంతో గీతమ్మను తీసుకుని ఆమె కుమారుడు ఇంటికి వెళ్లాడు. అయితే కాసేపటికే ఆమె పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే తమ్మను హోలెహోన్నూర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గీతమ్మ మరో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోలెహొన్నూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. సంజయ్, ఆశా, సంతోష్‌లను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ మిథున్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

‘ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పినా.. వినలేదు’.. బంధువు నాగప్ప

గీతమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని సంజయ్ కు సలహా ఇచ్చాను. గీతమ్మ మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. గత 15 రోజులుగా రాత్రిపూట అరుస్తోంది. ఆమెకు దుష్టాత్మ పట్టిందని సంజయ్ భావించాడు. సంఘటనకు నాలుగు రోజుల ముందు, ఆమెను శివమొగ్గలోని ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లమని నేను సూచించాను. కానీ ఆశా ఆమెకు ఉపశమనం కలిగిస్తుందని అతను భూత వైద్యం చేయించాడని బంధువు నాగప్ప మీడియాతో తెలిపాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.