Crime News: కలిసుంటానని చెప్పాడు.. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోశాడు.. అందరూ చూస్తుండగానే

|

Aug 14, 2022 | 1:58 PM

కర్ణాటక హసన్‌ జిల్లాకు చెందిన శివకుమార్‌ (32), చైత్ర (28) కు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య మనస్పర్థలు రావడంలో ఇటీవల హోలెనరాసిపుర ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

Crime News: కలిసుంటానని చెప్పాడు.. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోశాడు.. అందరూ చూస్తుండగానే
Crime News
Follow us on

Man Slits Estranged Wife: ఇష్టంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు కావాలంటూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఫ్యామిలీ కోర్టులో హాజరైన దంపతులకు.. న్యాయమూర్తులు కలిసుండాలంటూ ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. సరేనంటూ ఇద్దరూ బయటకు వచ్చారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ.. భర్త కోర్టు ఆవరణలోనే భార్యపై దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరు హోలే నరసిపురలోని ఫ్యామిలీ కోర్టులో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక హసన్‌ జిల్లాకు చెందిన శివకుమార్‌ (32), చైత్ర (28) కు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య మనస్పర్థలు రావడంలో ఇటీవల హోలెనరాసిపుర ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటినుంచి దూరంగా ఉంటున్న వీరిద్దరూ కౌన్సిలింగ్‌ కోసం కోర్టులో హాజరయ్యారు. ఈ సమయంలో తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలిసి ఉంటామని భార్యాభర్తలిద్దరూ అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో కోర్టు నుంచి బయటకు వచ్చిన శివకుమార్‌.. చైత్ర వాష్‌రూమ్‌కి వెళ్తుండగా అడ్డుకుని కత్తితో గొంతు కోశాడు.

వెంటనే ఆమెకు కృత్రిమ శ్వాస అందించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. పారిపోయేందుకు ప్రయత్నించిన శివకుమార్‌ను అక్కడున్నవారు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ‘కౌన్సిలింగ్‌ అనంతరం హత్యకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టామని.. కోర్టు ఆవరణలోకి నిందితుడు కత్తిని ఎలా తీసుకువచ్చాడనే విషయంపై కూడా ఆరా తీస్తున్నామని ఎస్పీ శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం