Cakes: ఇది తెలిస్తే కేక్‌ తినేందుకు జంకాల్సిందే.. ప్రాణాలకే ప్రమాదమంటోన్న ప్రభుత్వం

|

Oct 03, 2024 | 4:54 PM

కేక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. కర్ణాటకలోని పలు బేకరీల్లో తయారుచేసే కేక్‌లలో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరులోని పలు బేకరీల్లో తనిఖీలు చేపట్టగా సంచలన...

Cakes: ఇది తెలిస్తే కేక్‌ తినేందుకు జంకాల్సిందే.. ప్రాణాలకే ప్రమాదమంటోన్న ప్రభుత్వం
Cakes
Follow us on

పుట్టిన రోజు మొదలు ఏ చిన్న అకేషన్‌ ఉన్నా సరే కేక్‌ ఉండాల్సిందే. కేవలం సందర్భంతో సంబంధం లేకుండా సరదాగా కూడా కేక్‌లు లాగించే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ వార్త తెలిస్తే కేక్‌లు తినే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఈ విషయం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

కేక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. కర్ణాటకలోని పలు బేకరీల్లో తయారుచేసే కేక్‌లలో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరులోని పలు బేకరీల్లో తనిఖీలు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కేక్‌లపై నిర్వహించిన పరీక్షల్లో 12 రకాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా కేక్‌ల తయారీలో ఉపయోగించే కృత్రిమ కలర్స్‌లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కలర్స్‌ శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అధికారులు ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వం 235 కేక నమూనాలను పరీక్షించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ వంటి కేక్‌ల తయారీలో ఉపయోగించే కలర్స్‌లో.. ఆరోగ్యానికి హాని చేసే కారకాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో గోబీ మంచూరియన్, కాటన్ మిఠాయి వంటి ప్రసిద్ధ వంటకాల్లో ఉపయోగించే కలర్స్‌లో కూడా ఫుడ్ కలరింగ్ ఏజెంట్ రోడమైన్-బి వాడకాన్ని నిషేధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..