K’taka CM Basavaraj Bommai: ఇకపై ఆ పరిశ్రమలోని కార్మికులకు 50 శాతం రాయితీ.. కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం..

|

Dec 17, 2022 | 5:00 PM

కర్ణాటకలోని చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీని అందించేలా ఒక నూతన పథకాన్ని రూపొందించాలని, చేనేత కార్మికుల ఆవాసాల్లో నివాసముంటున్నవారికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం..

Ktaka CM Basavaraj Bommai: ఇకపై ఆ పరిశ్రమలోని కార్మికులకు 50 శాతం రాయితీ.. కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం..
Karnataka Cm Basavaraj Bommai
Follow us on

కర్ణాటకలోని చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీని అందించేలా ఒక నూతన పథకాన్ని రూపొందించాలని, చేనేత కార్మికుల ఆవాసాల్లో నివాసముంటున్నవారికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో నేత కార్మికుల డిమాండ్‌లపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ‘చేనేత పరిశ్రమను కూడా ‘కుటీర పరిశ్రమ’గా పరిగణించి, ఇంటి వద్దనే తమ వృత్తిని చేసుకునే చేనేత కార్మికులకు కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి రాయితీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన’ట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఇంకా చేనేత కార్మికుల పిల్లలకు విద్యానిధి పథకం పొడిగింపు, సంఘటిత కార్మికులకు సహాయం చేయడానికి ప్రభుత్వ సహాయాన్ని వచ్చే బడ్జెట్‌లో మంజూరు చేస్తామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు.

నేకార సమ్మాన్ పథకం కింద ఆర్థిక సహాయం..

నేకార సమ్మాన్ యోజన కింద డీబీటీ ద్వారా 2021-22 సంవత్సరంలో 49,544 మంది నేత కార్మికులకు రూ.990.88 లక్షలు విడుదలయ్యాయి. 2022-23 బడ్జెట్ ప్రకారం ఈ పథకం కింద నమోదైన చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం రూ.2,000/- నుంచి రూ.5,000/-కు పెంచారు. ఈ పథకం కోసం నమోదు చేసుకున్న 46,864 దరఖాస్తులను ఇప్పటి వరకు పరిశీలించి ఆమోదించారు.

ట్రిబ్యునల్ రాజ్యాంగంతో సమస్యల పరిష్కారం

ఇవి కూడా చదవండి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు (డిసెంబర్ 17) జరిగిన జీఎస్టీ సమావేశంలో సీఎం బొమ్మై సహా అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం బొమ్మై మాట్లాడుతూ.. ‘పలు జీఎస్టీ కేసులు హైకోర్టుకు వెళ్తాయి. ప్రత్యామ్నాయంగా ట్రిబ్యునల్ ఏర్పాటుపై కూడా చర్చ జరుగుతోంది. ట్రిబ్యునల్‌ ఏర్పాటుతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. దీని ఏర్పాటుపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామ’ని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..