కర్ణాటక ఉప ఎన్నికలకు కొత్త షెడ్యూల్ రిలీజ్

| Edited By:

Sep 28, 2019 | 10:04 AM

కర్ణాటకలో ఉప ఎన్నికలకు కొత్త షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. నవంబర్ 11 నుంచి 18 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని.. అనంతరం 19వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడుతామని ఈసీ ప్రకటనలో పేర్కొంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21న చివరి తేదీగా నిర్ణయించామని తెలిపింది. డిసెంబర్ 5న ఎన్నికలు జరగగా.. 9వ తేదీన […]

కర్ణాటక ఉప ఎన్నికలకు కొత్త షెడ్యూల్ రిలీజ్
Follow us on

కర్ణాటకలో ఉప ఎన్నికలకు కొత్త షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. నవంబర్ 11 నుంచి 18 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని.. అనంతరం 19వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడుతామని ఈసీ ప్రకటనలో పేర్కొంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21న చివరి తేదీగా నిర్ణయించామని తెలిపింది. డిసెంబర్ 5న ఎన్నికలు జరగగా.. 9వ తేదీన కౌంటింగ్ నిర్వహించనుంది. అయితే పాత షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్‌ 23-27 మధ్య దాఖలైన నామినేషన్లను కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. కాగా, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్‌ కెఆర్‌ రమేశ్‌ కుమార్‌ 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే అనర్హత వేటును సవాలు చేస్తూ.. ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో కర్ణాటక ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఈసీ గురువారం తెలిపింది.