
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఉదయం నుంచి ఉత్కంఠగా కొనసాగిన ఓట్ల లెక్కింపునకు తెరపడింది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 136 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 65, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాలకే పరిమితమయ్యాయి. ఇక కాంగ్రెస్ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కాంగ్రెస్ విజయంపై అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కర్ణాటక అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
I thank all those who have supported us in the Karnataka elections. I appreciate the hardwork of BJP Karyakartas. We shall serve Karnataka with even more vigour in the times to come.
— Narendra Modi (@narendramodi) May 13, 2023