కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి కపిల్ సిబల్ రాజ్యసభకు నామినేట్ అయిన సంగటి తెలిసిందే. లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే.. కపిల్ సిబల్ నామినేషన్‌పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసినట్లు ఆయన తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. మొదటి నమోదు పూర్తయింది. రాజ్యసభకు మరో ఇద్దరి పేర్లను త్వరలో ప్రకటించనున్నారు.
#WATCH | Kapil Sibal filed nomination for Rajya Sabha elections, with the support of SP, in presence of party chief Akhilesh Yadav & party MP Ram Gopal Yadav
He says, “I’ve filed nomination as Independent candidate. I have always wanted to be an independent voice in the country” pic.twitter.com/HLMVXYccHR
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 25, 2022