Kanwar Yatra: యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కన్వర్ యాత్ర రద్దు.. వ్యతిరేకించిన వీహెచ్‌పీ

Kanwar Yatra Cancel: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తోందన్న సూచనలతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో

Kanwar Yatra: యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కన్వర్ యాత్ర రద్దు.. వ్యతిరేకించిన వీహెచ్‌పీ
Kanwar Yatra
Follow us

|

Updated on: Jul 18, 2021 | 6:49 AM

Kanwar Yatra Cancel: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తోందన్న సూచనలతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పవిత్రమైన కన్వర్ యాత్రను రద్దు చేయగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా కన్వర్ యాత్రను రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి ఓ ప్రకటనను విడుదల చేసింది. ఉత్తరాదిన ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న కన్వర్ యాత్రపై యూపీ ప్రభుత్వం.. పునరాలోచించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. యాత్రపై నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలతో భక్తులకు ట్యాంకర్లను సమకూర్చాలని సూచించింది. మ‌త‌ప‌ర‌మైన అన్ని విశ్వాసాల కంటే ప్రజల ప్రాణాల ప‌రిర‌క్షణే ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇదిలాఉంటే.. యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశ్వ హిందూ ప‌రిష‌త్ (వీహెచ్పీ) స్పందించింది. ఈ నిర్ణయాన్ని తాము ఆమోదించ‌బోమ‌ని స్పష్టంచేసింది. క‌రోనా ప‌ట్ల సున్నితంగా ఆలోచిస్తున్న ప్రజలు, రాజ‌కీయ పార్టీల ర్యాలీలు, రైతుల నిర‌స‌నలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని వారు.. దీనిపై నిర్ణయం ఎలా తీసుకుంటారని వీహెచ్పీ అధికార ప్రతినిధి వినోద్ బ‌న్సాల్ వ్యాఖ్యానించారు. యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా ఉందని ప్రకటించారు. కాగా.. ఉత్తరాదిన శ్రావణ మాసంలో నిర్వహించే కన్వర్ యాత్రలో భాగంగా శివ భక్తులు గంగా నది నీటిని కావడిలో తీసుకొని వెళ్లి మహాశివుడికి జలాభిషేకం చేస్తారు.

Also Read:

Kerala’s Cleric Contro: రాత్రి 9 దాటాక రోడ్లపై వచ్చే మహిళలందరూ వేశ్యలే.. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేరళ మత గురువు!

Viral Video: పాపం.. ఏదో చేయబోయాడు.. మరేదో జరిగింది.. యువకుడి విఫల ప్రయత్నం చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు..