
చికిత్స కోసం వచ్చిన రోగిలా నటిస్తూ హాస్పిటల్‌లోకి వచ్చిన ఒక వ్యక్తి డాక్టర్ పాకెట్‌లో ఉన్న ఐఫోన్‌ను కొట్టేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని వెలుగు చూసింది. కాపేటికి తనతో ఫోన్ లేకపోవడం గమనించిన డాక్టర్ సీసీ కెమెరాలు పరిశీలించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేవలం గంట వ్యవధిలోనే పోలీసులు ఆ దొంగను పట్టుకొని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 20న, మొహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి వికలాంగుడిలా నటిస్తూ చికిత్స కోసం కాన్పూర్‌లోని హాలెట్ ఆసుపత్రిలోకి వచ్చాడు. తనకు నిజంగానే వికలత్వం ఉన్నట్టు అక్కడున్న డాక్టర్లను నమ్మించాడు. డాక్టర్లతో పాటు అక్కడున్న నర్సులు కూడా ఆది నమ్మారు. దీంతో అతనికి మందులు రాసిచ్చారు.
ఇది కూడా చదవండి: ఇదే మీ వ్యక్తిత్వం.. నిద్రించే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలానో తెలుసా
ఆ తర్వాత కాసేపు అక్కడే ఉన్న ఫయాజ్ ఎడమ చేతిలో వాకింగ్ స్టిక్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పట్టుకుని నెమ్మదిగా హాస్పిటల్ లాబీలో నడుకుంటూ వెళ్తున్నాడు.. ఇదే క్రమంలో దారిలో ఇద్దరు మహిళా డాక్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ల పక్కగుంటా వెళ్తున్న ఫయాజ్ ఎంతో చాకచక్యంగా ఒక డాక్టర్ యాప్రాన్ నుంచి మెల్లగా ఆమె ఐఫోన్‌ను కొట్టేశాడు. ఆ తర్వాత అలాగే కుంకుంటూ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు వదలరు!
ఇక కాసేపటి తర్వాత తన పాకెట్‌లో ఫోన్ కనిపించకపోవడంతో అప్రమత్తమైన డాక్టర్ సీసీ కెమెరాలను పరిశీలించి ఫోన్ దొంగతానికి గురైనట్టు గుర్తించింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఫయాజ్ కోసం హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కేవలం ఒక గంట వ్యవధిలోనే ఫయాజ్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అతనిడి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.
#कानपुर हैलट हॉस्पिटल में मोबाइल चोरी की वारदात..
दिव्यांग मरीज बनकर जूनियर डॉक्टर का चुराया मोबाइल,सीसीटीवी कैमरे में कैद हुई पूरी घटना,स्वरूप नगर पुलिस ने आरोपी चोर को किया गिरफ्तार,स्वरूप नगर थाना क्षेत्र का मामला.#kanpur #CCTV #CHORI #SIRFSUCH pic.twitter.com/ASaEsHakPl
— ठाkur Ankit Singh (@liveankitknp) August 24, 2025
మొబైల్ దొంగ కంటే తెలివిగా పనిచేసి అతన్ని గుర్తించినందుకు పోలీసుల బృందాన్ని నేను అభినందిస్తున్నాను అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రవణ్ కుమార్ అన్నారు. “సీసీటీవీ ఫుటేజ్ కారణంగా, మేము కేసును ఛేదించగలిగాము” అని ఆయన తెలిపారు. నిందితుడు గతంలోనే ఇలానే వేషాలు మార్చి ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: ఈ “టీ” రోజూ ఒక్కకప్పు తాగండి.. ఆ సమస్యలకు ఛూమంత్రం వేసినట్లే.. మీ జోలికి రావంతే!
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.