డ్రగ్స్ కేసులో కన్నడ నటి రాగిణి ద్వివేదీకి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. తనకు బెయిల్ నిరాకరిస్తూ కర్నాటక హైకోర్టు గత నవంబరు 3 న జారీ చేసిన ఉత్తర్వులను ఆమె అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ తో ఆమెకు సంబంధాలున్నాయన్న ఆరోపణపై బెంగుళూరు సీసీఎస్ పోలీసులు రాగిణిని లోగడ అరెస్టు చేశారు. ఆమెపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టెన్సెస్ యాక్ట్ కింద అభియోగం మోపారు. అయితే తనను తప్పుడు కేసులో ప్రాసిక్యూషన్ ఇరికించిందని ఆమె ఆరోపించింది. వంద రోజులకు పైగా జైల్లో ఉన్నా తన నుంచి ఎలాంటి డ్రగ్స్ ను పోలీసులు గానీ, నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గానీ స్వాధీనం చేసుకోలేకపోరని రాగిణి ద్వివేదీ పేర్కొంది. నేను నిందితురాలిని కాను అని ఇదివరకే స్పష్టం చేశానని ఆమె వెల్లడించింది.