తమిళులపై ‘హిందీ’ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు

| Edited By:

Aug 22, 2020 | 11:27 AM

తమిళనాడులో హిందీ భాష వివాదం మళ్లీ రాజుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్‌ విభాగంలో జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో సెక్రటరీ రాజేష్‌ కోతేచ మాట్లాడుతూ.

తమిళులపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు
Kanimozhi
Follow us on

Hindi controversy in Tamil Nadu: తమిళనాడులో హిందీ భాష వివాదం మళ్లీ రాజుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్‌ విభాగంలో జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో సెక్రటరీ రాజేష్‌ కోతేచ మాట్లాడుతూ.. హిందీ భాష తెలియన వాళ్లు సమావేశం నుంచి వైదొలగాలని వ్యాఖ్యలు చేశారు. వీటిపై డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. మరోవైపు రాజేష్ కోతేచ వ్యాఖ్యలపై డీఎంకే నేతలు, తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమిళులపై కేంద్రం హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎన్నిరోజులు హిందీ భాష రాదని తమిళులని అవమానిస్తారని,సెక్రెటరీ రాజేష్ కోతేచ వ్యాఖ్యలపై కేంద్రం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కనిమొళి డిమాండ్ చేస్తున్నారు.

Read More:

అతడిని హీరోగా వద్దని చెప్పిన ఎన్టీఆర్‌!

వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే