కంగనా తండ్రి అభ్యర్థనపై ఆమెకు వై-ప్లస్ భద్రత, కిషన్ రెడ్డి

| Edited By: Pardhasaradhi Peri

Sep 12, 2020 | 2:18 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తండ్రి చేసిన అభ్యర్థనపై ఆమెకు వై-ప్లస్ భద్రత కల్పించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తన కుమార్తెకు ఈ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కంగనా తండ్రి హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్  కి లేఖ రాయడమే కాక..

కంగనా తండ్రి అభ్యర్థనపై ఆమెకు వై-ప్లస్ భద్రత, కిషన్ రెడ్డి
Follow us on

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తండ్రి చేసిన అభ్యర్థనపై ఆమెకు వై-ప్లస్ భద్రత కల్పించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తన కుమార్తెకు ఈ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కంగనా తండ్రి హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్  కి లేఖ రాయడమే కాక, వ్యక్తిగతంగా కలిసి ఓ మెమోరాండం కూడా సమర్పించారని ఆయన చెప్పారు. తన కూతురిని మహారాష్ట్రలో వేధింపులకు గురి చేస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదు చేశారన్నారు. దీంతో కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలతో కంగనాకు 10 మంది సాయుధ కమెండోలతో వై-ప్లస్ భద్రత కల్పించినట్టు కిషన్ రెడ్డి వివరించారు. ముంబైలో కంగనాను అడుగు పెట్టనివ్వబోమంటూ శివసేన నేతలు హెచ్ఛరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ హెచ్ఛరికను సవాల్ చేసి,, ఆమె ముంబైలో కాలు పెట్టడం, ఆమె ఆఫీసును ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడం దేశ వ్యాప్త సంచలనమైంది.