Kalyan Singh: రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి.. మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఇకలేరు

|

Aug 21, 2021 | 10:12 PM

యూపీ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈరోజు తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన ఇవాళ ఆస్పత్రిలో చికిత్స

Kalyan Singh: రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి.. మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఇకలేరు
Kalyan Singh
Follow us on

Kalyan Singh: యూపీ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈరోజు తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కళ్యాణ్ సింగ్ వయసు 89 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలకు తోడు పలు అనారోగ్య సమస్యలు వేధిస్తుండంతో ఆయన ఆరోగ్యం ఇటీవల కొంతకాలంగా విషమిస్తూ వచ్చింది. అత్యవసర చికిత్స నిమిత్తం జూలైన 4వ తేదీన కళ్యాణ్ సింగ్ ఢిల్లీలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సైన్సెస్ (SGPGI) ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు.

ఆసుపత్రిలో నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ, ఇంకా న్యూరో-ఓటాలజీ విభాగాల నిపుణుల ప్యానెల్ ఏర్పాటై కళ్యాణ్ సింగ్ కు చికిత్స అందించారు. అయినప్పటికీ కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం కుదుటపడలేదు. ఆయన అంతకుముందు పలు అనారోగ్య సమస్యలతో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరి కళ్యాణ్ సింగ్ చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా, కల్యాణ్ సింగ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు అప్పట్లో లక్నోలోని ఎస్జీపీజీఐ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుని కళ్యాణ్ సింగ్ కోలుకున్న విషయం విదితమే.

Read also: Nampally Exhibition: ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్‌గా హరీశ్.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి కల్పిద్దామని ప్రకటన