K9-Vajra self-propelled howitzer: భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల అనంతరం.. తూర్పు లడాఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఇండియా కొత్త ఆయుధాలను మోహరించింది. చైనా సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద తొలిసారి కే9- వజ్రా హోవిట్జర్ యుద్ధ ట్యాంకులను ఇండియన్ ఆర్మీ మోహరించింది. కే9-వజ్రా గన్ సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శుత్రు లక్ష్యాలను ధ్వంసం చిల్చీచెండాడుతుంది. కే9-వజ్రా హోవిట్జర్ చెందిన రెజిమెంట్‌ను మొత్తాన్ని లడాఖ్‌లో మోహరించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వెల్లడించారు. కే9 వజ్రా ఆయుధాలు హై ఆల్టిట్యూడ్ ఏరియాల్లోనూ పనిచేస్తాయని తెలిపారు. ఫీల్డ్ ట్రయల్స్, యుద్ధ సమయంలో హోవిట్జర్ గన్నులు చాలా సక్సెస్ రేటును చూపించినట్లు నరవాణే వివరించారు. కే9 రెజిమెంట్‌ను పూర్తిగా మోహరించడం వల్ల కలిగే లాభాలను మనోజ్ ముకుంద్ వివరించారు.
#WATCH K9-Vajra self-propelled howitzer in action in a forward area in Eastern Ladakh pic.twitter.com/T8PsxfvstR
— ANI (@ANI) October 2, 2021
Also Read: