Justice MR Shah: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షాకు గుండెపోటు.. హిమాచల్ నుంచి ఢిల్లీకి తరలింపు..

|

Jun 16, 2022 | 4:25 PM

హిమాచల్ ప్రదేశ్‌లో ఉండగా.. సుప్రింకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముఖేష్‌కుమార్ రసిక్‌భాయ్ షా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు సమచారం అందించారు.

Justice MR Shah: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షాకు గుండెపోటు.. హిమాచల్ నుంచి ఢిల్లీకి తరలింపు..
Justice Mr Shah
Follow us on

Justice MR Shah: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా (64) గురువారం గుండెపోటుకు గురయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉండగా.. సుప్రింకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముఖేష్‌కుమార్ రసిక్‌భాయ్ షా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు సమచారం అందించారు. జస్టిస్ షాను ప్రస్తుతం విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు హోం మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతతకు గురైన జస్టిస్ ఎంఆర్ షాకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఆయన్ను ఢిల్లీకి రప్పించి మెరుగైన వైద్యం అందించే విషయంపై రమణ.. హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా గురువారం ఉదయం గుండెపోటు గురయ్యారని.. ఆయన్ను హిమాచల్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

64 ఏళ్ల జస్టిస్ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే ముందు పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ ఎంఆర్ షా ఒక సందర్భంలో.. ప్రధాని మోదీని ప్రజాదరణ పొందిన, శక్తివంతమైన దూరదృష్టి గల నాయకుడిగా అభివర్ణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..