Justice Arun Mishra: జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్మన్ ఎంపిక కసరత్తు పూర్తి.. జస్టిస్ అరుణ్ మిశ్రా పేరు దాదాపు ఖరారు..!

|

Jun 01, 2021 | 2:28 PM

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం దాదాపు ఖరారైంది. ఆయన పేరును హై-పవర్డ్ రికమండేషన్స్ కమిటీ ప్రతిపాదించినట్టు సమాచారం.

Justice Arun Mishra: జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్మన్ ఎంపిక కసరత్తు పూర్తి.. జస్టిస్ అరుణ్ మిశ్రా పేరు దాదాపు ఖరారు..!
Justice Arun Mishra Chairperson Of National Human Rights Commission
Follow us on

New NHRC Chairman Justice Arun Mishra: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం దాదాపు ఖరారైంది. ఆయన పేరును హై-పవర్డ్ రికమండేషన్స్ కమిటీ ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సభ్యులు కలిగిన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దళిత, ఆదివాసి, మైనారిటీ కమ్యూనిటీల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నందున ఆ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయాలని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. పరిశీలనకు వచ్చిన ఇతర పేర్లలో జమ్మూకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మహేష్ మిట్టల్ కుమార్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ రాజీవ్ జైన్ కూడా ఉన్నారు. మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2020 డిసెంబర్‌లో పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్‌పర్సన్ ఎంపిక జరగలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ చంద్ర పంత్ ప్రస్తుతం ఎన్‌హెచ్ఆర్‌సీ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. కాగా, జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2020 సెప్టెంబర్ 2న పదవీ విరమణ చేశారు. అరుణ్ మిశ్రా నియామకంపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది.


Read Also….  GOODNEWS ON COVID: కరోనా రావడమే మంచిదట.. ఓసారి సోకి, వ్యాక్సిన్ వేసుకుంటే ఇక రక్షణే రక్షణ