హత్రాస్ జిల్లాకు వెళ్తున్న జర్నలిస్ట్ సహా ముగ్గురి అరెస్ట్

| Edited By: Anil kumar poka

Oct 06, 2020 | 10:53 AM

యూపీలో హత్రాస్ జిల్లాకు వెళ్తున్న ఓ జర్నలిస్ట్ సహా ముగ్గురిని యూపీ పోలీసులు మధుర లోని టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి వీరు కారులో వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అటిక్ ఉర్ రహమాన్, సిద్ధిక్ కప్పన్, మసూద్ అహమద్, ఆలం అనే...

హత్రాస్ జిల్లాకు వెళ్తున్న జర్నలిస్ట్ సహా ముగ్గురి అరెస్ట్
Follow us on

యూపీలో హత్రాస్ జిల్లాకు వెళ్తున్న ఓ జర్నలిస్ట్ సహా ముగ్గురిని యూపీ పోలీసులు మధుర లోని టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి వీరు కారులో వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అటిక్ ఉర్ రహమాన్, సిద్ధిక్ కప్పన్, మసూద్ అహమద్, ఆలం అనే ఈ నలుగురినీ ఖాకీలు ఆపేశారు. ఢిల్లీ నుంచి కొందరు అనుమానాస్పద వ్యక్తులు హత్రాస్ వెళ్తున్నారని తమకు సమాచారం వచ్చిందని, వీరి నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్, కొంత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ నలుగురు నిషిధ్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందినవారని తెలిసింది. సిద్ధిక్ కప్పన్ కేరళ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి అని సమాచారం. తమ సభ్యుడిని వెంటనే విడుదల చేయాలని కేరళ వర్కింగ్ జర్నలిస్టులు యూపీ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. గతంలో సీఏఎ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చురుకుగా పాల్గొంది.