JoSAA Counselling 2023: జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. 6 విడతలుగా కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు

దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ బీటెక్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్సీ), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ బుధవారం (జూన్ 7) విడుదలైంది. మొత్తం ఆరు విడతలుగా..

JoSAA Counselling 2023: జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. 6 విడతలుగా కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు
JoSAA 2023 Counselling Schedule

Updated on: Jun 08, 2023 | 2:34 PM

దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ బీటెక్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్సీ), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ బుధవారం (జూన్ 7) విడుదలైంది. మొత్తం ఆరు విడతలుగా, 38 రోజులపాటు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. రిజల్ట్స్‌ విడుదలై తర్వాత రోజు నుంచే అంటే జూన్‌ 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జూన్ 27 వరకు విద్యార్థులకు అవగాహన కోసం మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఐఐటీ గువాహటి నిర్వహించిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ కూడా ఐఐటీ గువాహటి ఆధ్వర్యంలోనే జరగనుంది. జూన్ 19 నుంచి జులై 26న వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఉంటుంది. గతేడాది 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ ఐటీలు, 30 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సంస్థల్లో సీట్లను జోసా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేశారు. ఈ సంవత్సరం ఏఏ సంస్థలో ఎన్ని సీట్లున్నాయో ఐఐటీ గువాహటి త్వరలో ప్రకటించనుంది.

జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్ 2023 ఇదే..

  • జూన్‌ 19 – 27: నమూనా కౌన్సెలింగ్‌ ఉంటుంది. దానివల్ల తాము ఇచ్చిన ఐచ్ఛికాలతో ఎక్కడ సీటు రావొచ్చో అంచనా వస్తుంది. దాన్నిబట్టి మళ్లీ ఆప్షన్లు మార్చుకోవచ్చు.
  • జూన్‌ 28: రిజిస్ట్రేషన్‌, ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
  • జూన్‌30: తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • జులై 6న 2వ రౌండ్‌ సీట్ల కేటాయింపు
  • జులై 12న 3వ రౌండ్‌ సీట్ల కేటాయింపు
  • జులై 16న 4వ రౌండ్‌ సీట్ల కేటాయింపు
  • జులై 21న 5వ రౌండ్‌ సీట్ల కేటాయింపు
  • జులై 26వ తేదీన 6వ రౌండ్‌ సీట్ల కేటాయింపు

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.