ED Seized Two AK 47 Rifles: నగదు కోసం సోదాలు చేస్తుంటే ఏకే 47 రైఫిళ్లు దొరికాయి.. సీఎం సహాయకుడి ఇంట్లో సంచలనాలు..

నగదు కోసం సోదాలు చేస్తుంటే ఏకే 47 ఆయుధాలు కనిపించాయి. వాటిని చూసిన ఎన్​ఫోర్స్​మెంట్ Jharkhand illegal mining case: డైరెక్టరేట్‌ అధికారులు షాకయ్యారు. సీఎం సహాయకుడి ఇంట్లోని ఓ బీరువాలో ఇవి బయటపడ్డాయి.

ED Seized Two AK 47 Rifles: నగదు కోసం సోదాలు చేస్తుంటే ఏకే 47 రైఫిళ్లు దొరికాయి.. సీఎం సహాయకుడి ఇంట్లో సంచలనాలు..
Prem Prakash

Updated on: Aug 24, 2022 | 7:46 PM

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ పీఏ ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రెండు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. బుధవారం 17 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించింది. సొరెన్‌కు సహాయకుడైన ప్రేమ్‌ ప్రకాశ్‌ ఆస్తులపై సోదాలు జరిపింది. ఈ క్రమంలో అతడికి చెందిన ఓ ఇంటి బీర్వా రెండు ఏకే-47 గన్స్‌ను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ ఆయుధాలపై ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేయనున్నారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు సన్నిహితుడైన ప్రేమ్‌ ప్రకాశ్‌ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దాడులు చేస్తోంది.రాజధాని రాంచీలోని హర్ము, డోరండా, అశోక్‌నగర్‌తో సహా 11 ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో, ED రెండు అత్యాధునిక AK-47 రైఫిల్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్, దోపిడీ కేసులో ఈ దాడులు జరిగాయి. ఇంతకు ముందు కూడా ప్రేమ్ ప్రకాష్ నివాసాలపై ఈడీ దాడులు చేసింది.

ఎవరిని ప్రశ్నించిన తర్వాత ఈడీ దాడులు ..

ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే ప్రతినిధి పంకజ్ మిశ్రాను ప్రశ్నించిన తర్వాత ఈడీ దాడులు నిర్వహించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద జూలై 19న ఈడీ పంకజ్ మిశ్రాను అరెస్ట్ చేసింది. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ పంకజ్ మిశ్రాకు చెందిన 37 బ్యాంకు ఖాతాల్లో రూ.11 కోట్ల 88 లక్షలను గుర్తించింది. ఈ డబ్బును ఈడీ జప్తు చేసింది. ఈ డబ్బు పంకజ్ మిశ్రా కె, దాహు యాదవ్, వారి సహచరులకు చెందినది.

ఇవి కూడా చదవండి

ఓడను సీజ్ చేసింది

గతంలో 50 బ్యాంకు ఖాతాల్లో పడి ఉన్న రూ.13.32 కోట్ల నగదు, రూ.5.34 కోట్ల విలువైన లెక్కల్లో చూపని నగదు, అక్రమంగా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లు, ఇతర వస్తువులను ఈడీ సీజ్ చేసింది. పంకజ్ మిశ్రా, దాహు యాదవ్, వారి సహచరులకు సంబంధించిన పలు నేరారోపణ పత్రాలను కూడా దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. జులై 8, 2002న మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) చట్టం కింద దర్యాప్తు సంస్థ ఈ చర్య తీసుకుంది. ఆ సమయంలో అది సాహిబ్‌గంజ్, బర్హత్, రాజ్‌మహల్, మీర్జా చుంకీ, బర్హర్వాలో దాడులు నిర్వహించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం