జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ ఆరోగ్యం క్షీణించింది. అతన్ని రాంచీలోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం నెఫ్రాలజీ విభాగంలో డాక్టర్ అమిత్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. రాంచీలోని మేదాంతలో చేరిన తర్వాత శిబు సోరెన్‌కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. శిబు సోరెన్‌కి అప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లుగా వైద్యులు తెలిపారు. గురువారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో.. ముందుజాగ్రత్త చర్యగా ఆస్పత్రిలో చేర్పించారు. ఆక్సిజన్ అందించిన తర్వాత శిబు సోరెన్ పరిస్థితి కొంతవరకు కుదటపడినట్లుగా వైద్యులు తెలిపారు.
ఇందులో ఛాతీలో కొంత నీరు చేరడంతోనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లుగా నిర్దారించారు. వైద్యులు యాంటీబయాటిక్స్ ఇస్తూంటంతో ఆయన ఆరోగ్యం కొంత మెరుగైందన్నారు. జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ పరిస్థితి ఇంకా బాగానే ఉందని డాక్టర్ అమిత్ కుమార్ తెలిపారు.
ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మిగిలిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాతే తదుపరి చికిత్స జరుగుతుందన్నారు. ఇప్పుడే ఏమీ చెప్పలేమని, రిపోర్ట్ వచ్చిన తర్వాత రిఫర్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని డాక్టర్ చెప్పారు. ఇదిలావుంటే, శిబూ సోరెన్ ఆరోగ్యం క్షీణించన విషయం తెలుసుకున్న JMM నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం