JEE Advanced 2023 Today: మరికాసేపట్లో ప్రారంభంకానున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. చివరినిమిషంలో ఈ తప్పులు చేయకండి..

|

Jun 04, 2023 | 7:31 AM

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2023 ఆదివారం (జూన్ 4) జరగనుంది. దేశవ్యాప్తంగా 1.9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐఐటీల్లో ప్రవేశాలకు ఐఐటీ గౌహతి ఆధ్వర్యంలో..

JEE Advanced 2023 Today: మరికాసేపట్లో ప్రారంభంకానున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. చివరినిమిషంలో ఈ తప్పులు చేయకండి..
JEE Advanced 2023
Follow us on

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2023 ఆదివారం (జూన్ 4) జరగనుంది. దేశవ్యాప్తంగా 1.9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐఐటీల్లో ప్రవేశాలకు ఐఐటీ గౌహతి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరుగుతోంది. ఇప్పటికే అడ్మిట్‌కార్డులు కూడా విడుదలయ్యాయి. ఈ రోజు రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ల కింద పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఈ రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. ఉదయం9 నుంచి మ.12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ పరీక్ష మ.2:30 నుంచి 5:30 వరకు పరీక్ష జరుగుతుంది.

కాగా 2021 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.6 లక్షల మంది హాజరవగా, గతేడాది 1.7 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఏపీ, తెలంగాణల నుంచి దాదాపు 50వేల మంది వరకు అభ్యర్థులు ఉండనున్నారు. జేఈఈ మెయిన్‌ రెండు సెషన్లలో కలిపి దాదాపు 11,13,325 మంది పరీక్ష రాశారు. ఇందులో కటాఫ్‌ మార్కులు సాధించిన వారిలో టాప్‌ 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు.ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతో పాటు అభ్యర్థులకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా చేసింది.

ఇవి కూడా చదవండి

‘ఒక్క నిమిషం’ ఆలస్యమైనా నో ఎంట్రీ

  • పరీక్ష కేంద్రంలోకి నిర్దేశించిన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులకు అనుమతి ఉండదు.
  • అడ్మిట్‌ కార్డు, అధికారిక ఫొటో ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి.
  • అడ్మిట్‌కార్డు జిరాక్సు కాపీని ఇన్విజిలేటర్లకు అందించి ఒరిజినల్‌ కాపీని తమ వద్దనే భద్రపరచుకోవాలి.
  • షూలు ధరించి రాకూడదు. అలాగే, పెద్ద బటన్‌లు ఉన్న వస్త్రాలు, ఫుల్‌స్లీవ్‌ డ్రెస్‌లు, బంగారపు ఆభరణాలను ధరించరాదు.
  • బాల్‌పాయింట్‌ పెన్నుతోపాటు, పెన్సిల్, ఎరేజర్‌లను తెచ్చుకోవచ్చు. సాధారణమైన వాచీని ధరించవచ్చు. డిజిటల్‌ వాచీలు, పరికరాలను అనుమతించబోరు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.