Jayalalitha death mystery: వాటి కారణంగానే జయలలిత మృతి.. ఎట్టకేలకు కీలక ప్రకటన చేసిన ఎయిమ్స్ డాక్టర్స్..

Jayalalitha death mystery: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత డెత్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అపోలో ఆస్పత్రి తప్పేం లేదని, ఆమె తీసుకున్న కొన్ని..

Jayalalitha death mystery: వాటి కారణంగానే జయలలిత మృతి.. ఎట్టకేలకు కీలక ప్రకటన చేసిన ఎయిమ్స్ డాక్టర్స్..
Jayalalitha

Updated on: Aug 22, 2022 | 12:01 PM

Jayalalitha death mystery: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత డెత్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అపోలో ఆస్పత్రి తప్పేం లేదని, ఆమె తీసుకున్న కొన్ని రకాల ఆహార పదార్థాలవల్లే ఆరోగ్యం మరింత విషమించిందని స్పష్టం చేసింది ఎయిమ్స్. కేక్స్, స్వీట్లే ఆమె ప్రాణం తీశామని స్పష్టం చేసింది ఎయిమ్స్ బృందం. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తరువాత చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె ద్రాక్ష, కేక్, స్వీట్లు తీసుకున్నారని, ఫలితంగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని చెప్పారు. ఈ మేరకు జయలలిత మృతిపై కమిషన్ కు ఎయిమ్స్ వైద్య బృందం మూడు పేజీల నివేదికను సమర్పించింది. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరక ముందే జయలలితకు బీపీ, షుగర్, థైరాయిడ్ అధిక స్థాయిలో ఉన్నాయని ఎయిమ్స్ వైద్య బృందం తెలిపింది.

అపోలో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఆమె స్వీట్లు, కేక్, ద్రాక్షపళ్లను తిన్నారని ఆమె ఫ్యామిలీ డాక్టర్ శివకుమార్ వెల్లడించారు. 2016 సెప్టెంబర్ 28న ఆమె ఆరోగ్యం క్షీణించిందని, ఊపిరితిత్తుల సమస్య తలెత్తిందని వెల్లడించింది ఎయిమ్స్‌. అక్టోబర్ 7న ఆమెకు ట్రాకియోస్టమీ చికిత్సను ప్రారంభించారని తెలిపింది. అక్టోబర్ 14 నుంచి లండన్ డాక్టర్ రిచర్డ్ బిలే, ఎయిమ్స్ వైద్యులు, అపోలో ప్రత్యేక వైద్యులు జయకు చికిత్స అందించారని చెప్పింది.

డిసెంబర్ 3వ తేదీ నాటికి జయ ఆరోగ్యం మరింత క్షీణించిందని, 4వ తేదీన శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారని.. దీంతో ఆమెకు ఎక్మో ఏర్పాటు చేసి 24 గంటల పాటు పర్యవేక్షించారని పేర్కొంది. 5వ తేదీన ఆమె గుండె, మెదడు పని చేయలేదని.. ఆమె మృతి చెందారని చెప్పింది. జయకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపం లేదని తన నివేదికలో స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..