ఓవైవు ఢిల్లీలో తన కోడలిని ఈడీ విచారిస్తుండగానే రాజ్యసభలో బీజేపీపై విరుచుకుపడ్డారు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ . బీజేపీకి త్వరలోనే చెడ్డరోజులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తన కుటుంబంపై బీజేపీ ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. విపక్షాలు మాట్లాడకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జయబచ్చన్. తనను బీజేపీ ఎంపీలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు. రాజ్యసభలో ఐశ్వర్యారాయ్ పేరును బీజేపీ ఎంపీలు ప్రస్తావించడంపై ఆవేశంతో ఊగిపోయారు జయాబచ్చన్. పనామా పేపర్స్‌లో ఐశ్వర్యారాయ్ పేరు బయటకు రావడంతో ఆమెను ఈడీ విచారిస్తోంది.
What a fiery turn by Rajya Sabha MP from @samajwadiparty , Jaya Bachchan in the House. “Aapke burey din shuru hone waaley hain. I curse you!” Incidentally on a day when daughter in law Aishwarya Rai Bachchan is summoned by ED.
— Nistula Hebbar (@nistula) December 20, 2021
ఈడీ ఎదుట హాజరయిన ఐశ్వర్యారాయ్
పనామా పేపర్స్ కేసు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపగా, ఒక్కో పేరు బయటకి వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌కి నోటీసులు జారీ చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఐశ్వర్యారాయ్ విచారణకు రావాలని గతంలోనే సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. అయితే అప్పుడు ఐశ్వర్యారాయ్ వాయిదా కోరింది. కొన్ని రోజులు సమయం కావాలని కోరడంతో ఇప్పటి వరకు వాయిదా పడింది. తాజాగా ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు ఐశ్వర్యారాయ్.
పనామా పేపర్ల లీకేజీపై ఈడీ దర్యాప్తుకు ఐశ్వర్యారాయ్ హాజరు కావడంతో ఈ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది.
విదేశాల్లో నల్లధనం దాచుకున్న విషయంపై ఐశ్వర్యారాయ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తన ఖాతాల నుంచి విదేశాలకు డబ్బు మళ్లింపుపై ఈడీ అధికారులకు వివరణ ఇచ్చారు ఐశ్వర్యారాయ్. ఫేమా చట్టం ఉల్లంఘించడంపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. మొదట ఈడీ విచారణకు ఇవాళ హాజరు కాలేనని చెప్పిన ఐశ్వర్యారాయ్ ఆకస్మాత్తుగా ఢిల్లీలోని జామ్‌నగర్‌లో ఉన్న ఈడీ కార్యాలయం ముందు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈ కేసులో ఇంకా ఎంతమందిని ప్రశ్నిస్తారోనని అంతటా ఉత్కంఠ నెలకొంది.
పనామా దేశానికి చెందిన మొసాక్ ఫోన్సెకా అనే కార్పొరేట్, న్యాయ సేవల సంస్థ దేశదేశాల్లో నెలకొల్పిన వేలాది డొల్ల కంపెనీల బాగోతాన్ని 2016లో బయటపెట్టింది. ఈ వ్యవహారం పలువురు ప్రముఖులపై కేసుల నమోదుకు దారితీసింది. 136 కోట్ల డాలర్ల అక్రమ ధనాన్ని అధికారులు స్వాధీనం చేసుకునేలా చేసింది. దేశదేశాల్లోని రాజకీయ నాయకులు, కార్పొరేట్ అధిపతులు, సినీరంగానికి చెందిన వారు అక్రమ ధనాన్ని ఈ రహస్య ఖాతాల్లోకి మళ్ళించడానికి తోడ్పడే సంస్థ గుట్టు బయటపడింది.
Also Read: యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం