Jawad Cyclone AP Update: జొవాద్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఒడిశా సహా ఏపీ, తీరప్రాంతాల్లో భారీగా ఉండనుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే.. శనివారం సాయంత్రానికి జొవాద్ తుఫాన్ బలహినపడి దిశ మార్చుకొని పయనమవుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కదులుతున్న తుఫాన్ బలహిన పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆరు గంటల్లో మూడు కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనమవుతోందని పేర్కొంది. ప్రస్తుతం జోవాద్ తుఫాన్ విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310, పారాదీప్‌కు 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈరోజు రాత్రికి తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీకి సమీపంలో వాయుగుండంగా మరింత బలహీన పడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒడిశాలోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అయితే.. తుఫాన్ క్రమంగా బలహీనపడుతున్న నేపథ్యంలో గాలుల వేగం కూడా తగ్గుముఖం పట్టే అవకాశముందని పేర్కొంది. క్రమంగా పశ్చిమ బెంగాల్ తీరం వద్ద మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ స్పష్టం చేసింది.
అయితే.. ఏపీలో తుఫాన్‌ను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒడిశా వైపు తుఫాన్ వెళ్లినా రేపు సాయంత్రం వరకు అధికారులు పూర్తి స్థాయిలో అలెర్ట్‌గా ఉంటారని తెలిపారు. ఏపీలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తుఫాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫైర్ డిపార్ట్‌మెంట్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. సహాయక చర్యల సామగ్రితో సిద్ధంగా ఉన్నారు. దీంతోపాటు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు.
‘JAWAD’ weakened into a Deep Depression at 1730 hrs IST of today, lay about 180 km east-southeast of Vishakhapatnam, 260 km south of Gopalpur , 330 km south-southwest of Puri and 420 km south-southwest of Paradip.@CMO_Odisha @SecyChief @IPR_Odisha @SRC_Odisha @osdma pic.twitter.com/qmzrgrVBUL
— India Meteorological Department (@Indiametdept) December 4, 2021
Also Read: