ఒక్క మాటలో తేల్చేశారుగా.. బీహార్ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ జోస్యం!

బీహార్‌లో అటు ఎన్డీఏ,ఇటు ఇండి కూటమిలో సీట్ల పంచాయితీ తేలడం లేదు. కాంగ్రెస్‌కు 54 సీట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు తేజస్వి యాదవ్‌. అయితే రఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ఓటమి ఖాయమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్‌ కిశోర్‌ తేల్చి చెప్పారు. పార్టీ అదేశిస్తే తేజస్విపై పోటీకి తాను సిద్దమని స్పష్టం చేశారు.

ఒక్క మాటలో తేల్చేశారుగా.. బీహార్ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ జోస్యం!
Prashant Kishor

Edited By: TV9 Telugu

Updated on: Oct 14, 2025 | 6:00 PM

బీహార్‌లో అటు ఎన్డీఏ,ఇటు ఇండి కూటమిలో సీట్ల పంచాయితీ తేలడం లేదు. కాంగ్రెస్‌కు 54 సీట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు తేజస్వి యాదవ్‌. అయితే రఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ఓటమి ఖాయమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్‌ కిశోర్‌ తేల్చి చెప్పారు. పార్టీ అదేశిస్తే తేజస్విపై పోటీకి తాను సిద్దమని స్పష్టం చేశారు.

బీహార్‌లో సీట్ల పొత్తు చర్చలు సాగుతున్నాయి. మరోవైపు అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలోనే జన్‌సురాజ్‌ పార్టీ నేత ప్రశాంత్‌కిశోర్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు. 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోయినట్టే రఘోపూర్‌లో తేజస్వీ యాదవ్‌కు ఘోర ఓటమి తప్పదన్నారు. వైశాలి జిల్లా రఘోపూర్‌ లో ఎన్నికల ప్రచారన్ని ప్రారంభించారు. ఇదే రఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తేజస్వీ ‌యాదవ్ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. రఘోపూర్‌లో తేజస్వియాదవ్‌పై పోటీ చేసే విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని అన్నారు. రఘోపూర్‌లో ఓటమి భయం తోనే తేజస్వియాదవ్‌ రెండో సీటులో పోటీకి సిద్దమవుతున్నారని తెలిపారు.

ఢిల్లీకి చేరిన ఎన్డీఏ కూటమి సీట్ల పంచాయితీ

ఇదిలావుంటే, ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్ధుబాటుపై ఢిల్లీలో బీజేపీ నేతల కీలక సమావేశం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన భేటీ అమిత్‌షాతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. అక్టోబర్ 13వ తేదీన బీజేపీ అభ్యర్ధుల జాబితా విడదలయ్యే అవకాశం ఉంది. ఎల్‌జేపీ అధ్యక్షడు చిరాగ్‌ పాశ్వాన్‌తో బీజేపీ నేతల మంతనాలు కొనసాగుతున్నాయి. LJPకి 25 సీట్లు ఇస్తామని బీజేపీ ఇప్పటికే ఆఫర్‌ ఇచ్చింది. కేంద్ర మంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ కూడా తనకు ఏడు సీట్లు ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర్‌ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు 15 సీట్లు కావాలని మాంఝీ డిమాండ్‌ చేస్తున్నారు.

కాంగ్రెస్‌కు 54 సీట్లు ఇచ్చేందుకు తేజస్వి సిద్ధం

మరోవైపు మహాఘట్‌బంధన్ కూటమిలో కూడా సీట్ల సర్ధుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌కు 54 సీట్లు ఇచ్చేందుకు తేజస్వి యాదవ్‌ ఆఫర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం మరో 4 సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీతో తేజస్వియాదవ్‌ సమావేశం తరువాత సీట్ల పొత్తుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నయి. 135 సీట్లలో RJD పోటీ చేసే అవకాశాలున్నాయి. మిగతా సీట్లను మిత్రపక్షాలకు కేటాయించే ఛాన్స్‌ ఉంది. కాగా, బీహార్‌లో థర్డ్‌ ఫ్రంట్‌ నుంచి మజ్లిస్‌ పార్టీ అభ్యర్ధులను బరిలోకి దింపుతోంది. 16 జిల్లాల్లో 32 మంది అభ్యర్ధుల తొలి జాబితాను మజ్లిస్‌ పార్టీ విడుదల చేసింది. 100 సీట్లలో పోటీ చేస్తామని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..