
జుమ్మూలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఉనికి కోసం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది పాకిస్తాన్. ప్రపంచ దేశాల ముందు పరవుు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా జమ్ము లక్ష్యంగా పాక్ ఆత్మాహుతి డ్రోన్ దాడులకు తెగబడింది. వార్‌కి రెడీగా ఉన్న భారత్.. గగనతలంలోనే పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తోంది. మరోవైపు జమ్మూ జిల్లా వ్యాప్తంగా ప్రజలను అలెర్ట్ చేస్తోంది సైన్యం. కంటిన్యూగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్‌లో పూర్తిగా విద్యుత్ నిలిపివేశారు అధికారులు. . మొత్తంగా ఇప్పటివరకు ఎనిమిది డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు తెలిసింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
మరోవైపు పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాలో బ్లాకౌట్ ప్రకటించారు అధికారులు. గురువారం రాత్రి 9 గంటల నుంచి 8గంటల పాటు బ్లాకౌట్ ఉంటుందని జిల్లా అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..