Snowfall: మంచు దుప్పటి కప్పుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బద్రీనాథ్.. ధవళవర్ణ కాంతులతో పలు ప్రాంతాలు కనుల విందు..

|

Dec 29, 2021 | 4:38 PM

Snowfall: ఓ వైపు శీతాకాలం.. మరో వైపు ప్రకృతి మార్పులతో దేశమంతా చలితీవ్రత పెరిగిపోయింది. శీతలగాలులు వీస్తున్నాయి. పగటివేళ్ళలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా..

Snowfall: మంచు దుప్పటి కప్పుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బద్రీనాథ్.. ధవళవర్ణ కాంతులతో పలు ప్రాంతాలు కనుల విందు..
Snowfall
Follow us on

Snowfall: ఓ వైపు శీతాకాలం.. మరో వైపు ప్రకృతి మార్పులతో దేశమంతా చలితీవ్రత పెరిగిపోయింది. శీతలగాలులు వీస్తున్నాయి. పగటివేళ్ళలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో హిమాలయాల సమీపంలోని రాష్ట్రాల్లో శీతల గాలులు వీచడంతో పాటు మంచు వర్షం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని ప్రజలు ప్రాంతాలు హిమపాతంతో తడిచిముద్దవుతున్నాయి. అనేక ప్రాంతాలు ధవళ కాంతులను సంతరించుకున్నాయి.

ఈరోజు ఉత్త‌రాఖండ్ లో అనేక ప్రాంతాల్లో భారీ మంచు వర్షం కురిసింది. చార్‌ధామ్‌లో ఒక‌టైన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బ‌ద్రీనాథ్ ఆల‌య పరిసర ప్రాంతాలు మంచు వ‌ర్షంలో త‌డిసి ముద్దయ్యాయి. బ‌ద్రినాథ్ ఆల‌యాన్ని మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఆల‌య ప‌రిస‌రాలు, దాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు ధవళ వస్త్రం పరుచుకున్నట్లు మారి వీక్షకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. మనోహరంగా మరీనా ఈ దృశ్యాలు క‌నువిందు చేస్తున్నాయి.

అయితే శీతాకాలం కావడంతో చార్ ధామ్ గా పిలిచే బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కొన్ని రోజుల క్రితమే మూసివేశారు. దీంతో ఈ సుంద‌ర దృశ్యాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసే అవకాశం భక్తులకు లేదు..

 

Also Read:   మనవాళిపై పగబట్టిన వైరస్‌లు.. ఆదేశంలో వేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. 5వేల కొంగలు మృతి.. 5లక్షల కోళ్లు చంపివేత..