ఘోర ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్లు మృతి!

జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదంలో ముగ్గురు సిఆర్‌పిఎఫ్ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఘోర ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్లు మృతి!
Jammu & Kasmeer

Updated on: Aug 07, 2025 | 3:09 PM

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. సీఆర్పీఎఫ్ జనాన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదంలో ముగ్గురు జవాన్లు స్పాట్‌లోనే మరణించారు. వివరాల్లోకి వెళితే.. సిఆర్‌పిఎఫ్ వాహనం కొండ ప్రాంతంలోని ఒక ప్రదేశానికి వెళుతుండగా మార్గమధ్యలో వచ్చిన ఒక మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో వాహనం రోడ్డుపై నుంచి జారి పక్కనే ఉన్న లోతైన లోయలో పడిపోయిందని, దీనివల్ల ప్రాణనష్టం జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు మొదలు పెట్టారని.. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రమాద స్థలం నుండి ఆర్మీ హాస్పిటల్‌కు తరలించినట్టు వర్గాలు పేర్కొన్నాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి చాలా విషమంగా ఉందని.. దీంతో మెరుగైన చికిత్స కోసం వారిని మరో హాస్పిటల్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు. ఉధంపుర్ డిప్యూటీ కమిషనర్ అభ్యర్థన మేరకు, తీవ్రంగా గాయపడిన వారిని ఆర్మీ హెలికాప్టర్లలో తీసుకెళ్లినట్టు తెలిపారు.

ఈ ఘటనపై స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తన X వేదికగా స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బసంత్‌గఢ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ వాహనం ప్రమాదానికి గురైన వార్త తనను కలచివేసిందని ఆయన అన్నారు. ఆ వాహనంలో అనేక మంది ధైర్యవంతులైన CRPF జవాన్లు ఉన్నారు” అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. స్థానిక డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడానని.. ఆమె స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.