J&K Police: జమ్మూ కాశ్మీర్ పోలీసులా మజాకా.. ఆ చిన్న క్లూతో భారీ ఉగ్ర కుట్ర ఎలా భగ్నం చేశారంటే?

దేశంలో ఉగ్రవాద నిరోధక చర్యల్లో భారీ విజయం సాధించారు జమ్ముకశ్మీర్ పోలీసులు. జైష్-ఎ-మొహమ్మద్ (జెఇఎం), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (ఎజియుహెచ్) ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు దేశంలో జరిగే భారీ ఉగ్ర కుట్రలను భగ్నం చేశారు.. వైట్ కాలర్ ముసుగులో దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇందోళన కలిగించే విషయం ఏంటంటే పట్టుబడిన వారిలో డాక్టర్లు కూడా ఉన్నారు.

J&K Police: జమ్మూ కాశ్మీర్ పోలీసులా మజాకా.. ఆ చిన్న క్లూతో భారీ ఉగ్ర కుట్ర ఎలా భగ్నం చేశారంటే?
Jammu Kashmir Police

Edited By: Anand T

Updated on: Nov 10, 2025 | 6:50 PM

అక్టోబర్ 19న శ్రీనగర్‌లోని బన్‌పోరా నౌగామ్‌లోని వివిధ ప్రదేశాలలో పోలీసులు, భద్రతా దళాలను బెదిరిస్తూ JEM ఉగ్రవాద సంస్థ పోస్టర్లు వెలిశాయి.. వీటిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఉగ్ర కుట్రల వెనుక పాకిస్తాన్ ఇతర దేశాల నుండి పనిచేస్తున్న విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్న రాడికలైజ్డ్ నిపుణులు, విద్యార్థులతో కూడిన వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్‌ ఉందని గుర్తించారు.. ఈ బృందం ఉగ్ర సంస్థల ప్రచారం, సమన్వయం, నిధుల తరలింపు లాజిస్టిక్స్ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించారు.. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో ప్రొఫెషనల్ విద్యా నెట్‌వర్క్‌ల ద్వారా ఉగ్రవాదులు నిధులు సేకరిస్తున్నారు.. తీవ్రవాదాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకోవడం, నిధులను సేకరించడం, లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడం, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించడం IEDలను తయారు చేయడానికి అవసరమైన సామగ్రిని సేకరించడంలో ఉగ్ర నెట్ వర్క్ పనిచేస్తుంది..

2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

ఉగ్రవాదుల నెట్ వర్క్ ఛేదించే కేసులో భాగంగా మొదటగా శ్రీనగర్, అనంతనాగ్, గండర్‌బాల్, షోపియన్‌లలో అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో హర్యానా పోలీసులతో కలిసి ఫరీదాబాద్‌లో, యూపీ పోలీసులతో కలిసి సహరాన్‌పూర్‌లో సోదాలు జరిపారు.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నేరారోపణలకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి IED తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఒక చైనీస్ స్టార్ పిస్టల్ ,ఒక బెరెట్టా పిస్టల్ ,ఒక AK 56 రైఫిల్ ,ఒక AK క్రింకోవ్ రైఫిల్ తో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.. ఇందులో 2900 KG IED తయారీ పదార్థాలున్నాయి.. అమ్మోనియం నైట్రేట్, పేలుడు పదార్థాలు, రసాయనాలు, కారకాలు, మండే పదార్థం, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, బ్యాటరీలు, వైర్లు, రిమోట్ కంట్రోల్, టైమర్లు, మెటల్ షీట్లు స్వాధీనం చేసుకున్నారు..

ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఉగ్ర కుట్రలను ఛేదించిన కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరికొంత మంది కోసం గాలింపు కొనసాగుతుంది..అరెస్ట్ అయిన వారిలో ఆరిఫ్ నిసార్ దార్, సాహిల్ (నౌగామ్, శ్రీనగర్),యాసిర్-ఉల్-అష్రఫ్ (నౌగామ్, శ్రీనగర్),మక్సూద్ అహ్మద్ దార్, షాహిద్ (నౌగామ్, శ్రీనగర్),మోల్వి ఇర్ఫాన్ అహ్మద్ (మసీదు ఇమామ్) (షోపియాన్),జమీర్ అహ్మద్ అహంగర్, ముత్లాషా, (వకురా గందర్బాల్),డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై ముసాయిబ్ (కోయిల్, పుల్వామా),డాక్టర్ అడీల్ (వాన్‌పోరా, కుల్గాం) ఉన్నారు .. మరికొందరి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.