Delhi: ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. సగటు AQI 347గా నమోదైంది. పొగమంచు, పంట వ్యర్థాల దహనంతో కాలుష్య తీవ్రత పెరిగింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం ఆందోళనలు చేపడుతుండగా, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టనుంది. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పొగమంచు, విషవాయువులు, దుమ్ము, ధూళి కణాలతో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 347 పాయింట్లుగా నమోదైంది. చలి పెరగడం, పొగమంచు ప్రభావంతో కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లలో పంట వ్యర్థాల దహనం, పరిశ్రమల కాలుష్యం ఈ దుస్థితికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు ఢిల్లీలో గ్రాబ్-2 చర్యలు అమలవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లామర్ షో చాలు.. ఇక నటిస్తామంటున్న కుర్ర హీరోయిన్లు
Pawan Kalyan: కథలు రెడీ.. పవన్ రెడీగా ఉన్నారా
ముంబైలోనే సెటిల్ అవ్వాలని చూస్తున్న ఆ హీరోయిన్లు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు

