Bus Accident: ఘోర ప్రమాదం.. 300 అడుగుల లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి!

|

Nov 15, 2023 | 3:22 PM

జమ్మూ కశ్మీర్‌లో బుధవారం (నవంబర్ 15) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 300 అడుగుల ఎత్తునుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషయమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కిష్త్వాఢ్‌ నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే..

Bus Accident: ఘోర ప్రమాదం.. 300 అడుగుల లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి!
Doda Road Accident
Follow us on

శ్రీనగర్‌, నవంబర్ 15: జమ్మూ కశ్మీర్‌లో బుధవారం (నవంబర్ 15) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 300 అడుగుల ఎత్తునుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషయమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కిష్త్వాఢ్‌ నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జమ్మూలోని దోడా జిల్లాలో బటోత్‌-కిష్త్వాఢ్‌ జాతీయ రహదారిపై నంబర్ JK02CN-6555 కలిగిన బస్సు చీనాబ్ నది కాలువలో పడిపోయింది. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జయ్యింది.

కిష్త్వాఢ్‌ నుంచి సుమారు 50 మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో తృంగాల్‌-అస్సార్‌ ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు దాదాపు 300 అడుగుల లోయలో ఉన్న చీనాబ్‌ నదీ కాలువలో జారిపడింది. బటోటే-కిష్త్వార్ జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో రోడ్డుపై నుంచి జారి 300 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 36 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని డోడాతోపాటు కిష్త్వాఢ్‌ జనరల్‌ ఆసుపత్రులకు తరలించారు.

సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్‌ సేవలను సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. అక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మృతదేహాలను వెలికి తీశారు. దోడాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశార. అవసరాన్ని బట్టి అన్ని సహాయం చర్యలు చేపడతామని, నిరంతరం వారితో టచ్‌లో ఉంటానని తన పోస్టులో తెలిపారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ50 వేల చొప్పున ప్రధాన మంత్రి నష్టపరిహారం ప్రకటించినట్లు ఆయన తెలిపారు.