Jammu and Kashmir: 30 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో తెరుచుకున్న మూవీ థియేటర్లు.. సినిమాను వీక్షించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

|

Sep 19, 2022 | 3:29 PM

జమ్మూకశ్మీర్‌లో 1980 వరకు సినిమా థియేటర్లు ఉండేవి. అయితే, ఆ తర్వాత ఉగ్రవాదం పెచ్చుమీరడంతో 1990 దశకంలో సినిమా హాళ్లన్నీ మూతపడ్డాయి. దీంతో జమ్మూకశ్మీర్ ప్రజలు వినోదానికి దూరమయ్యారు.

Jammu and Kashmir: 30 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో తెరుచుకున్న మూవీ థియేటర్లు.. సినిమాను వీక్షించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
Cinema Halls In Kashmir
Follow us on

Jammu and Kashmir: ఉగ్రవాదం కారణంగా జమ్మూకశ్మీర్‌లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మూతబడిన సినిమా థియేటర్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. పుల్వామా, సోపియాలలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీ పర్పస్ సినిమా హాళ్లను ప్రారంభించి సినిమా వీక్షించారు. భవిష్యత్‌లో జమ్మూలోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు గవర్నర్. అనంత్‌నాగ్, శ్రీనగర్, బందిపొరా, గందర్‌బల్, దోడా, రాజౌరి, ఫూంచ్, కిష్ట్వార్, రియాసీలలో త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సినిమా ప్రదర్శనతోపాటు ఇన్ఫోటైన్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే వచ్చే వారం తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. 520 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ థియేటర్ శ్రీనగర్‌లోని సోమ్‌వార్ ప్రాంతంలో ఉంది. ఇందులో మూడు స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

 

ఇవి కూడా చదవండి

జమ్మూకశ్మీర్‌లో 1980 వరకు సినిమా థియేటర్లు ఉండేవి. అయితే, ఆ తర్వాత ఉగ్రవాదం పెచ్చుమీరడంతో 1990 దశకంలో సినిమా హాళ్లన్నీ మూతపడ్డాయి. దీంతో జమ్మూకశ్మీర్ ప్రజలు వినోదానికి దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ వాటిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, 1999లో శ్రీనగర్‌ లోని లాల్‌చౌక్‌లో ఉన్న రీగల్ థియేటర్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి దిగడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఇక అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ ప్రజలకు వినోదం అందుబాటులో లేకుండా పోయింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..