Jammu and Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత..ముష్కరమూకలు, భద్రతా బలగాల మద్య భీకర పోరు..అవును.. జమ్ముకశ్మీర్‌లో హై టెన్షన్ నెలకొంది. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే వారి కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నారు మన భద్రతా బలగాలు. తాజాగా సోపోర్‌లో జవాన్లు, ఉగ్రవాదుల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టాయి బలగాలు. ఓ ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.
శ్రీనగర్‌లోని అలుచి బాగ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు లస్కరే తోయిబా ఉగ్రవాదులను హతమార్చారు. ఆ ఉగ్రవాదులు లష్కరే తోయిబాలో కమాండర్ స్థాయిలో విధులు నిర్వహించే అబ్బాస్ షేక్, షకీబ్ మన్సూర్‌లుగా గుర్తించారు. ఇటీవల పోలీసులు విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ల జాబితాలో చనిపోయిన ఈ ఇద్దరి పేర్లు ఉన్నట్లు సమాచారం.
అలుచి బాగ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
#Encounter has started at #Sopore. Police and security forces are on the job. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) August 23, 2021
Shruti Haasan: నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన శృతి హాసన్.. ఇంతకు అతడు ఏమడిగాడో తెలుసా..?