‘జామియా’ లైబ్రరీలో విద్యార్థులపై విరిగిన పోలీసు లాఠీ.. ఇదిగో వీడియో

సీఏఏని నిరసిస్తూ ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేసిన సందర్భంగా పోలీసులు అక్కడి లైబ్రరీలోకి ప్రవేశించి అక్కడే ఉన్న వారిపై లాఠీలు ఝళిపించారు. దొరికినవారిని దొరికినట్టు చావబాదారు. పోలీసులకు దొరకకుండా కొందరు విద్యార్థులు బల్లల కింద దాక్కోగా, మరికొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ పోలీసు దాష్టీకం తాలూకు 49 సెకండ్ల వీడియోను ‘జామియా కో-ఆర్డినేషన్ కమిటీ’ విడుదల చేసింది. (పాత, కొత్త విద్యార్థులతో ఈ […]

'జామియా' లైబ్రరీలో విద్యార్థులపై విరిగిన పోలీసు లాఠీ.. ఇదిగో వీడియో
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 16, 2020 | 2:03 PM

సీఏఏని నిరసిస్తూ ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేసిన సందర్భంగా పోలీసులు అక్కడి లైబ్రరీలోకి ప్రవేశించి అక్కడే ఉన్న వారిపై లాఠీలు ఝళిపించారు. దొరికినవారిని దొరికినట్టు చావబాదారు. పోలీసులకు దొరకకుండా కొందరు విద్యార్థులు బల్లల కింద దాక్కోగా, మరికొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ పోలీసు దాష్టీకం తాలూకు 49 సెకండ్ల వీడియోను ‘జామియా కో-ఆర్డినేషన్ కమిటీ’ విడుదల చేసింది. (పాత, కొత్త విద్యార్థులతో ఈ కమిటీ ఏర్పాటైంది). సీఏఏకి వ్యతిరేకంగా గత డిసెంబరు 15 న జామియా మిలియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థులు జరిపిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. నాడు పోలీసులకు, వారికి మధ్య జరిగిన ఘర్షణల్లోపలువురు గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. లైబ్రరీలోకి ఎంటరయి.. అక్కడా లాఠీలకు పని చెప్పారు. అనేకమంది విద్యార్థులను అరెస్టు చేశారు.

కాగా-ఈ సీసీటీవీ ఫుటేజీపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోలీసులమీద  ట్వీట్లతో విరుచుకుపడింది.  యూనివర్సిటీ లైబ్రరీలోకి పోలీసులు ప్రవేశించలేదని, విద్యార్థులపై లాఠీఛార్జి కూడా చేయలేదని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన అబధ్ధమని ఈ వీడియో నిరూపిస్తోందని  కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఈ పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అటు-మరో నేత శశిథరూర్ కూడా ఈ వీడియోపై స్పందిస్తూ.. తక్షణమే ఆ  పోలీసులను అరెస్టు చేయాలని ఆయన కోరారు.

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!