Arvind Kejriwal 3.0: ఢిల్లీ పీఠంపై ముచ్చటగా మూడోసారి.. మరో ఆరుగురు మంత్రుల ప్రమాణం..
Arvind Kejriwal 3.0: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకకు హస్తినవాసులతో పాటు ఆప్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అంతేకాక బుడత కేజ్రీవాల్ అందరి దృష్టిని ఆకర్షించాడని చెప్పాలి. ‘ధన్యవాద్ ఢిల్లీ’ పేరుతో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారాన్ని ముగించారు. Also Read: Prime Minister Modi Wrote Letter To Rickshaw Puller ఇక ఆయన తన మునపటి మంత్రివర్గాన్ని కొనసాగించిన నేపథ్యంలో మరో […]
Arvind Kejriwal 3.0: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకకు హస్తినవాసులతో పాటు ఆప్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అంతేకాక బుడత కేజ్రీవాల్ అందరి దృష్టిని ఆకర్షించాడని చెప్పాలి. ‘ధన్యవాద్ ఢిల్లీ’ పేరుతో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారాన్ని ముగించారు.
Also Read: Prime Minister Modi Wrote Letter To Rickshaw Puller
ఇక ఆయన తన మునపటి మంత్రివర్గాన్ని కొనసాగించిన నేపథ్యంలో మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వారిలో మనీష్ సిసోడియా, సత్యేంద్రా జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్‌లు ఉన్నారు. కాగా, ఇవాళ సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసి వచ్చే ఐదేళ్ల కార్యాచరణను వీరితో కలిసి చర్చించనున్నట్లు సమాచారం.