IND Vs NZ: కివీస్‌తో మొదటి టెస్ట్.. టీమిండియాకు గుడ్ న్యూస్…

India Vs New Zealand: టీమిండియాకు కివీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందే తీపికబురు అందింది. ఇప్పటికే వన్డే సిరీస్ ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న కోహ్లీసేనకు ఫుల్ జోష్ ఇచ్చే వార్త ఇది. గత కొద్దిరోజులుగా సీనియర్ పేసర్‌గా సేవలందిస్తున్న స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయం నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కిందటి నెలలో జరిగిన రంజీ మ్యాచ్‌లో అతడి కాలికి గాయం కాగా… ఇటీవల జరిగిన ఫిట్‌నెస్ టెస్టులో అతడు పాస్ అయినట్లు సమాచారం. Also […]

IND Vs NZ: కివీస్‌తో మొదటి టెస్ట్.. టీమిండియాకు గుడ్ న్యూస్...
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 16, 2020 | 2:49 PM

India Vs New Zealand: టీమిండియాకు కివీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందే తీపికబురు అందింది. ఇప్పటికే వన్డే సిరీస్ ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న కోహ్లీసేనకు ఫుల్ జోష్ ఇచ్చే వార్త ఇది. గత కొద్దిరోజులుగా సీనియర్ పేసర్‌గా సేవలందిస్తున్న స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయం నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కిందటి నెలలో జరిగిన రంజీ మ్యాచ్‌లో అతడి కాలికి గాయం కాగా… ఇటీవల జరిగిన ఫిట్‌నెస్ టెస్టులో అతడు పాస్ అయినట్లు సమాచారం.

Also Read: IPL Schedule Dhoni, Virat And Rohit In One Team

దీనితో ఇషాంత్ దాదాపు మొదటి టెస్ట్‌కే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు రిహాబ్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఇషాంత్ శర్మ టెస్టుల్లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రాకు తోడు ఇషాంత్‌ జట్టులోకి రానుండటంతో.. టీమిండియాకు బలం చేకూరుతుందని చెప్పాలి. కాగా, న్యూజిలాండ్‌తో తొలి టెస్టు వెల్లింగ్టన్ వేదికగా ఈ నెల 21న ప్రారంభం కానుంది.