IPL 2020 Schedule: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. రోహిత్, విరాట్, ధోనిలు కలిసి ఒకే టీమ్‌లో…

IPL 2020 Schedule: ఐపీఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. మార్చి 29 మొదటి మ్యాచ్ ప్రారంభం కానుండగా.. మే 24న ఫైనల్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తలబడనున్నాయి. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల డేట్స్‌ వివరాలను మాత్రమే విడుదల చేయగా.. మరికొద్ది రోజుల్లో నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఇదిలా ఉంటే చివరి లీగ్ మ్యాచ్‌ మే 17న […]

IPL 2020 Schedule: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. రోహిత్, విరాట్, ధోనిలు కలిసి ఒకే టీమ్‌లో...
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 16, 2020 | 2:49 PM

IPL 2020 Schedule: ఐపీఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. మార్చి 29 మొదటి మ్యాచ్ ప్రారంభం కానుండగా.. మే 24న ఫైనల్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తలబడనున్నాయి. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల డేట్స్‌ వివరాలను మాత్రమే విడుదల చేయగా.. మరికొద్ది రోజుల్లో నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఇదిలా ఉంటే చివరి లీగ్ మ్యాచ్‌ మే 17న జరగనుంది. అంతేకాక ఈసారి డబుల్ హెడర్ మ్యాచ్‌ల సంఖ్యను బాగా తగ్గించారు. అటు ఆల్ స్టార్ మ్యాచ్‌ను మార్చి 25న నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కలిసి ఒకే టీమ్ తరపున ఆడే అవకాశం ఉంది. మరోవైపు రాజస్థాన్ జట్టును మినహాయిస్తే.. మిగిలిన ఏడు జట్లూ తమ సొంత వేదికలను కొనసాగించనున్నాయి.

Also Read:  Star Bowler Set To Join Indian Team Ahead Of First Test

ఆల్ స్టార్ మ్యాచ్‌ విశేషం…

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఓ ఛారిటీ మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. సరిగ్గా టోర్నమెంట్ ప్రారంభం కానున్న మూడు రోజులకు ముందు ఈ మ్యాచ్ జరగనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నార్త్, ఈస్ట్(ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌) ఫ్రాంచైజీలు ఒక జట్టు గానూ.. సౌత్, వెస్ట్(చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్) ఫ్రాంచైజీలు మరో జట్టుగా కలిసి ఆడనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ కాన్సెప్ట్ రూపకర్తలు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్‌లని సమాచారం.

ఒకే టీమ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎం‌ఎస్ ధోని, డివిలియర్స్…

ఇక ఈ ఛారిటీ మ్యాచ్‌.. వెస్ట్, సౌత్ ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, డివిలియర్స్, షేన్ వాట్సన్, బుమ్రా, మలింగా వంటి స్టార్ ప్లేయర్లు ఒకే టీమ్ తరపున ఆడనున్నారు. అంతేకాక నార్త్ అండ్ ఈస్ట్ ఫ్రాంచైజీల ఫ్యాన్స్.. రస్సల్, పంత్, స్టోక్స్, బట్లర్, శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్, మోర్గాన్, స్టీవ్ స్మిత్, ఆర్చర్ వంటి ఆటగాళ్లను సేమ్ టీమ్‌లో చూడవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట గుజరాత్‌లో కొత్తగా నిర్మితమైన అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందని సమాచారం. అంతేకాకుండా తలా ధోని ఈ మ్యాచ్‌తో క్రికెట్‌కు రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ గయ్స్…