Operation Sindoor: జై హింద్.. భారత్‌ మాతాకీ జై.. ఆపరేషన్‌ సింధూర్‌కు అభినందనల వెల్లువ

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఎటాక్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. ఒక్క బహావల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం 100 మందిని మట్టుపెట్టారు.

Operation Sindoor: జై హింద్.. భారత్‌ మాతాకీ జై.. ఆపరేషన్‌ సింధూర్‌కు అభినందనల వెల్లువ
Operation Sindoor

Updated on: May 07, 2025 | 9:14 AM

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఎటాక్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. ఒక్క బహావల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం 100 మందిని మట్టుపెట్టారు. అర్ధరాత్రి ఒంటిగంటా 28 నిమిషాలకు దాడులు ప్రారంభించినట్టు ఆర్మీ ట్వీట్ చేసింది. మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే టార్గెట్‌గా మిస్సైల్‌ దాడులు జరిగాయి..

ఆపరేషన్ సింధూర్‌పై కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.. జైహింద్, మేరా భారత్ మహాన్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఆపరేషన్‌ సింధూర్‌కు అభినందనల వెల్లువ వ్యక్తమవుతోంది.. భారత్‌ మాతాకీ జై అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు.

జై హింద్‌కీ సేనా అంటూ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ట్వీట్ చేశారు.


జై హింద్‌.. జై హింద్‌కీ సేనా అంటూ యోగి ఆదిత్యనాథ్‌ ట్వీట్ చేశారు.

జై హింద్ అంటూ సీఎం చంద్రబాబు, లోకేష్‌ ట్వీట్లు చేశారు.

భారత్‌ మాతాకీ జై అంటూ పీయూష్‌ గోయల్ ట్వీట్ చేశారు.

జీరో టోలరెన్స్ ఫర్ టెర్రరిజం.. భారత్ మాతాకీ జై అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ట్వీట్ చేశారు.

విదేశాంగ మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రపంచం ఉపేక్షించకూడదు.. ఆపరేషన్ సింధూర్‌.. జైహింద్‌ అంటూ జైశంకర్ ట్వీట్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..