Jabalpur Girl Murder Case: శ్రద్ధా వాకర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అఫ్తాబ్ అనే దుర్మార్గుడు.. నమ్మి వచ్చిన ప్రియురాల్ని చంపి 35 ముక్కలుగా కోసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరిన విషయం తెలిసిందే. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పునావాలాను అరెస్ట్ చేసిన పోలీసులు.. కీలక ఆధారాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు.. అందరినీ కలవరపడేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్‌తో ప్రియురాలు రొమాన్స్ చేస్తుందని.. మరో శాడిస్ట్ ఆమెను గొంతు కోసి దారుణంగా చంపాడు. అనంతరం ఆ శాడిస్ట్.. ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసి సంచలనం సృష్టించాడు. ఢిల్లీ ఘటన మర్చిపోకముందే మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్‌పూర్‌లో మరో దారుణ హత్య వెలుగులోకి రావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. నిందితుడు అభిజిత్ పాటిదార్ చేతిలో హత్యకు గురైన బాధితురాలిని శిల్పా ఝరియా (25)గా పోలీసులు గుర్తించారు. అయితే.. ఆమెను చంపిన అనంతరం.. సోషల్ మీడియాలో పలు వీడియోలను కూడా షేర్ చేశాడు. ఈ ఘటన జబల్‌పూర్ మేఖ్లా రిసార్ట్‌లో నవంబర్ 8న చోటుచేసుకోగా.. తాజాగా.. కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో కస్టడీలో ఉన్న జితేంద్ర కుమార్, సుమిత్ పటేల్‌లను పోలీసులు విచారిస్తున్నారు.
వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన అభిజిత్ పాటిదార్ వ్యాపారం చేసేవాడు. బీహార్ లోని పాట్నాకు చెందిన జితేంద్ర కుమార్ ను బిజినెస్ పార్టనర్‌గా చేసుకున్నాడు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌కి చెందిన శిల్పా అనే యువతితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తరువాత అభిజిత్, శిల్ప దగ్గరయ్యారు. ప్రియురాలు శిల్పాతో అభిజిత్ విహార యాత్రలకు వెళ్లి జల్సాలు చేసి వచ్చేవాడు. కొంత కాలం తరువాత అభిజిత్ స్నేహితుడితో శిల్ప పరిచయం పెంచుకుంది. అభిజిత్‌తో డేటింగ్.. స్నేహితుడితో విహార యాత్రలు చేసేది. అంతేకాదు అభిజిత్ దగ్గర తీసుకున్న 12లక్షలు అతని స్నేహితుడికి ఇచ్చి ఇద్దరు ఎంజాయ్ చేయడం మొదలెట్టారు.
ఈ విషయం అభిజిత్ చెవిన పడింది. నమ్మితే మోసం చేశావంటూ కోపం పెంచుకున్నాడు. శిల్పను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. హత్య చేసేముందు మూడు రోజుల క్రితం జబల్‌పూర్ వెళ్లాడు. ఓ హోటల్ లో రూమ్ తీసుకుని అక్కడికే శిల్పాను పిలిపించుకున్నాడు. ప్లాన్ ప్రకారం గొంతు, మణికట్టు కోసి చంపేశాడు. హత్య చేసేటప్పుడు ఫోటోలు, వీడియో తీశాడు. ఈమె నన్ను మోసం చేసింది, నేను ఈమెను చంపేసి మంచిపని చేశానంటూ ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన అన్ని వివరాలను చెప్పడంతోపాటు.. బాబు స్వర్గంలో మళ్ళీ కలుద్దాం.. అంటూ వీడియోలో చెప్పాడు.
శిల్ప హత్య తరువాత రిసార్ట్ నుంచి 8న ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిజిత్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హత్య కేసులో ప్రధాన నిందితుడైన అభిజిత్.. యువతి ఇన్‌స్టాగ్రామ్ ఐడీని నిరంతరం ఉపయోగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. హత్యకేసులో పరారీలో ఉన్న అభిజిత్ పాటిదార్ పలు చీటింగ్ కేసులలో నిందితుడిగా ఉంటూ నగరంలోని వ్యాపారులను లక్షల్లో మోసం చేశాడని తెలిపారు. ప్రస్తుతం సైబర్ సెల్ బృందాలు కూడా రంగంలోకి దిగాయని జబల్ పూర్ పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..