
సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతోంది. మంగళవారం నాడు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దు వెంట కాల్పులకు దిగింది. రాత్రి 7.45 గంటలకు లైన్ ఆఫ్ కంట్రోల్ లోని ఆక్నూర్ సెక్టార్ మీదుగా కాల్పులకు తెగబడిందని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌కు ధీటుగా సమాధానమిచ్చిందని అధికారులు తెలిపారు. చిన్న చిన్న ఆయుధాలను ఉపయోగిస్తుండటంతో పాటు.. మోర్టార్ షెల్స్‌ను పాక్ సైన్యం ఉపయోగిస్తుందన్నారు.
కాగా, గత కొద్ది రోజులుగా భారత్‌లోకి ఉగ్రవాదుల్ని చొరబడేలా పాక్ సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులు చోరబడేందుకు వీలుగా.. భారత సైన్యం దృష్టి మరల్చేందుకు ఇలా నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే భారత సైన్యం మాత్రం ఓ వైపు లోయలో ఉగ్రవేట కోనసాగిస్తూ.. మరోవైపు సరిహద్దు వద్ద అప్రమత్తంగా ఉంటుంది.