ITBP Recruitment 2023: మహిళా నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ).. 81 హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫరీ) (మిడ్ వైఫ్) (నాన్ గెజిటెడ్ & నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతిలో ఉత్తీర్ణత..

ITBP Recruitment 2023: మహిళా నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..
Indo Tibetan Border Police

Updated on: Jun 06, 2023 | 9:55 PM

న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ).. 81 హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫరీ) (మిడ్ వైఫ్) (నాన్ గెజిటెడ్ & నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతిలో ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆక్సిలరీ నర్సింగ్ మిడ్‌వైఫరీ కోర్సుకు సంబంధించి సర్టిఫికెట్‌ ఉండాలి. జులై 8, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. జూన్‌ 6, 1998 నుంచి జులై 8, 2005 మధ్య జన్మించిన వారు అర్హులు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

ఆసక్తి కలిగిన వారు జులై 8, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫకేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అధికారిక వెబ్‌సైట్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.