Rahul Gandhi:నాడు ఎమర్జెన్సీ విధింపు పొరబాటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒప్పుకోలు, కానీ, పార్టీ ‘డిజైన్’ మారలేదు

| Edited By: Anil kumar poka

Mar 03, 2021 | 10:28 AM

నాడు తన గ్రాండ్ మదర్ ఇందిరా గాంధీ దేశంలో  అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధిస్తూ తీసుకున్న నిర్ణయం పొరబాటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంగీకరించారు.

Rahul Gandhi:నాడు ఎమర్జెన్సీ విధింపు పొరబాటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒప్పుకోలు, కానీ, పార్టీ డిజైన్ మారలేదు
Rahul Gandhi
Follow us on

Rahul Gandhi On Emergency:నాడు తన గ్రాండ్ మదర్ ఇందిరా గాంధీ దేశంలో  అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధిస్తూ తీసుకున్న నిర్ణయం పొరబాటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంగీకరించారు. 1975-77 మధ్య కాలంలో దేశం ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొందని ఆయన అన్నారు. ఆ కాలంలో జరిగిన ఈ ఉదంతం తప్పేనని పేర్కొన్నారు. ఆ నాడు పత్రికా స్వేఛ్చకు సంకెళ్లు పడ్డాయని, ప్రభుత్వాన్ని విమర్శించిన విపక్ష నేతలను జైళ్లలో నిర్బంధించారని, పౌర హక్కులను అణచివేశారని వార్తలు వచ్చ్చాయని, కానీ అప్పటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉందని ఆయన చెప్పారు. అయితే అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ కాంగ్రెస్ తన సంస్థాగతమైన ‘డిజైన్’ ని వీడలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి వివరణ ఇస్తూ..పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే ఉందని, భారత సంస్థాగత ఫ్రెమ్ వర్క్ కి ఎలాంటి భంగం వాటిల్లలేదని ఆయన చెప్పారు.  అసలు పార్టీకి ఇంతటి సత్తా కూడా లేదన్నారు.ప్రముఖ ఎకనామిస్ట్ కౌశిక్ బసుతో వర్చ్యువల్ గా ఇంటరాక్ట్ అయిన ఆయన..ఆ నాటి పరిస్థితికి,నేటి పరిస్థితికి మధ్య చాలా తేడా ఉందన్న విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. నేడు ఆర్ ఎస్ ఎస్ తన నేతలతో ఈ వ్యవస్థను నింపేసిందన్నారు.  దీని ప్రభావం దేశం మీద, సమాజం మీద చాలా ఉందన్నారు. ఎన్నికల్లో బీజేపీపై తమ పార్టీ విజయం సాధించినా, ఈ నేతల బెడద నుంచి తప్పించుకోజాలదన్నారు.

ఇండియాలో ఇన్స్ టి ట్యూషనల్ బ్యాలన్స్ అన్నదానీపై  బీజేపీ ‘మౌలిక గురువైన’ ఆర్ఎస్ఎస్ ఎటాక్ చేసిందని, అసలు ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమేసిందని ఆయన వ్యాఖ్యానించారు. తనకు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కు మధ్య ఒక సందర్భంలో జరిగిన సంభాషణను ఆయన గుర్తు చేశారు. తన ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు తన మాటలను వినడంలేదని, వారంతా ఆర్ ఎస్ ఎస్ తో లింకు గలవారని కమల్ నాథ్ చెప్పారని రాహుల్ పేర్కొన్నారు. కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోవడానికి ముందు తమ మధ్య ఈ సంభాషణ జరిగిందన్నారు. అటు ఇటీవల హోం మంత్రి అమిత్ షా నాటి ఎమర్జెన్సీ ని తీవ్రంగా తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య విలువలను ఈ మార్గం ద్వారా తుంగలో తొక్కారని, ఎదురు తిరిగిన నేతలను జైళ్లల్లో వేశారని ఆయన దుయ్యబట్టారు. పేదలు , బలాహీన వర్గాలపై నాడు ఎన్నో అరాచకాలు జరిగాయని ఆయన ట్వీట్ చేశారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

Gold Rate In Hyderabad Video: మహిళలకు శుభవార్త..మరింత తగ్గిన బంగారం ధర.

మూడవ అంతస్తు నుండి పిల్లల్ని కిటికీలోంచి ప‌డేసిన త‌ల్లి! Mother Throwing Children Out The Window Viral Video.