ఇక సరిహద్దులపై మరింతగా అంతరిక్ష నిఘా.. ఇస్రోదే ఈ ఘనత !

|

Nov 19, 2019 | 3:55 PM

అంతరిక్షం నుంచి సరిహద్దుల భద్రతపై నిఘా మరింతగా పెరగనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా చేసిన ఈ ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఆకాశం నుంచే బోర్డర్లో పరిస్థితిపై నిరంతరం నిఘా పెట్టేందుకు మూడు ఉపగ్రహాలను (సర్వేలెన్స్ శాటిలైట్స్) లాంచ్ చేసేందుకు ఈ సంస్థ సమాయత్తమవుతోంది. వీటిలో ఒకదానిని ఈ నెల 25 న, రెండింటిని డిసెంబరులో ప్రయోగించబోతోంది. ఈ మూడు శాటిలైట్స్ తో బాటు మూడు పీఎస్ఎల్వీ రాకెట్లు.. రెండు డజన్ల విదేశీ […]

ఇక సరిహద్దులపై మరింతగా అంతరిక్ష నిఘా.. ఇస్రోదే ఈ ఘనత !
Follow us on

అంతరిక్షం నుంచి సరిహద్దుల భద్రతపై నిఘా మరింతగా పెరగనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా చేసిన ఈ ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఆకాశం నుంచే బోర్డర్లో పరిస్థితిపై నిరంతరం నిఘా పెట్టేందుకు మూడు ఉపగ్రహాలను (సర్వేలెన్స్ శాటిలైట్స్) లాంచ్ చేసేందుకు ఈ సంస్థ సమాయత్తమవుతోంది. వీటిలో ఒకదానిని ఈ నెల 25 న, రెండింటిని డిసెంబరులో ప్రయోగించబోతోంది. ఈ మూడు శాటిలైట్స్ తో బాటు మూడు పీఎస్ఎల్వీ రాకెట్లు.. రెండు డజన్ల విదేశీ నానో, మైక్రో శాటిలైట్స్ ని మోసుకువెళ్తాయి. నవంబరు 25 వ తేదీ ఉదయం 9 గంటల 28 నిముషాలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించే పీఎస్ఎల్వీసీ-47 రాకెట్.. మూడో జనరేషన్ భూ పరిశీలన శాటిలైట్ ‘ కార్టోశాట్-3 ‘ ని తీసుకువెళ్లనుంది. ఈ రాకెట్ ప్రైమరీ పే లోడ్ తో బాటు అమెరికా నుంచి సేకరించిన 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలను కూడా మోసుకువెళ్తుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ నానో శాటిలైట్ల వాణిజ్య డీల్ కు సంబంధించి కొత్తగా ఏర్పాటైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. కార్టోశాట్-3 ని 97.5 డిగ్రీల ఏటవాలున 509 కిలో మీటర్ల కక్ష్యలో ప్రవేశపెడతారు.
ఇక రీశాట్-2 బీఆర్ఐ, రీశాట్-2 బీఆర్-2 అనే మరో రెండు నిఘా శాటిలైట్స్ ని కూడా ఇస్రో లాంచ్ చేయనుంది. డిసెంబరులో శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీసీ-48, సీ 49 రాకెట్ల సాయంతో వీటిని ప్రయోగిస్తారు. ఇస్రో గతంలో.. ఏప్రిల్ 1 న ఎమిశాట్ సర్వేలెన్స్ శాటిలైట్ ని, మే 22 న రీశాట్-2 బీ నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. జపాన్ కు చెందిన క్యూఐపీఎస్ సంస్థ రెండు మైక్రో శాటిలైట్స్ ని అభివృధ్ది పరచింది. వీటిని ఇస్రో లాంచ్ చేయబోతోంది.