కశ్మీర్ మూడు ముక్కలు కానుందా..?

| Edited By: Pardhasaradhi Peri

Aug 04, 2019 | 3:26 PM

కశ్మీర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం. అసలు అక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్.. సర్వత్రా నెలకొంది. ఓ వైపు ఉగ్రవాదం, మరోవైపు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి.. భారత్‌పై కయ్యానికి కాలుదువ్వడం.. మరోవైపు అమర్‌నాథ్ యాత్ర అర్థాంతరంగా నిలిపివేత. అకస్మాత్తుగా పాఠశాలలకు, కళాశాలలకు సెలవుల ప్రకటన. ఇదంతా ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న కల్లోలం. అయితే అసలు అక్కడ జరుగుతున్న పరిణామాలేంటి..? జమ్ముకశ్మీర్ విషయంలో అసలు కేంద్రం ఏ చేయబోతోంది. భిన్నాభిప్రాయాలు […]

కశ్మీర్ మూడు ముక్కలు కానుందా..?
Follow us on

కశ్మీర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం. అసలు అక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్.. సర్వత్రా నెలకొంది. ఓ వైపు ఉగ్రవాదం, మరోవైపు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి.. భారత్‌పై కయ్యానికి కాలుదువ్వడం.. మరోవైపు అమర్‌నాథ్ యాత్ర అర్థాంతరంగా నిలిపివేత. అకస్మాత్తుగా పాఠశాలలకు, కళాశాలలకు సెలవుల ప్రకటన. ఇదంతా ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న కల్లోలం.

అయితే అసలు అక్కడ జరుగుతున్న పరిణామాలేంటి..? జమ్ముకశ్మీర్ విషయంలో అసలు కేంద్రం ఏ చేయబోతోంది. భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న పరిస్థితి. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. అదేంటంటే.. జమ్ముకశ్మీర్ ముక్కలు కానుంది. జమ్ము కశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగానూ, లడక్, కశ్మీర్‌లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించబోతున్నాయని. అయితే ప్రస్తుతం కశ్మీర్ అంశంపై కేంద్ర నుంచి ఎలాంటి ప్రకటనలు లేవు.

అయితే ఇటీవల అక్కడ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది కేంద్రం. తొలుత 10వేల మందిని.. ఆ తర్వాత 28 వేల మంది సైన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దింపింది. అమర్ నాథ్ యాత్ర మార్గంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ.. హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో.. భద్రతను కట్టుదిట్టం చేశామని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై అక్కడి స్థానిక పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు మండిపడుతున్నాయి. అమర్‌నాథ్ యాత్ర మార్గంలో ఉగ్ర హెచ్చరికలు వస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు సైన్యాన్ని దించారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు అమర్‌నాథ్ యాత్రికులతో పాటుగా లోయలో ఉన్న పర్యాటకుల్ని వీలైనంత త్వరగా వెనక్కి పంపిచేయడం వంటి అంశాలు… కాశ్మీర్‌లో ఏదో జరిగిపోతోందన్న ఊహలకు ఆజ్యం పోస్తున్నాయి.

అంతేకాదు.. ఆగస్టు 15న జమ్ముకశ్మీర్‌లోనే ప్రధాని మోదీ జెండా ఎగరవేయనున్నట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. అయితే తాజాగా అమిత్ షా, జాతీయ సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో పాటు ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, “రా” చీఫ్ సామంత్ గోయల్, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా తదితరులతో ఆయన సమావేశం అయ్యారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నారనే వదంతులు వంటి వరుస పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఓ కీలక బిల్లును అమిత్‌షా సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ ( రెండో సవరణ) బిల్లు -2019 ను ఆయన రాజ్యసభలో ప్రతిపాదించనున్నారు. కశ్మీర్ లోయలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ బిల్లు నిర్ధేశిస్తోంది.

మరోవైపు ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 250 మంది ఉగ్రవాదులు ఉన్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఇక్కడ తన కార్యకలాపాలు జోరుగా సాగిస్తోందని.. మూడు చోట్ల భారీ దాడులకు ఉగ్రవాదులు స్కెచ్ వేశారన్న హెచ్చిరికలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లో మూడు లక్షల మంది సైనికులు ఉన్నారు. ఇటీవలే అదనంగా 10వేల కేంద్ర బలగాలు వెళ్లాయి. మరో 28వేల బలగాలు వెళ్లబోతున్నాయి. ఇదే అందర్నీ ఆశ్చర్యంలో, ఆందోళనలో పడేస్తోంది. అకస్మాత్తుగా సంచలన ప్రకటనలు చేసే అలవాటు ఉన్న బీజేపీ… నోట్ల రద్దు ప్రకటనలాగే… కాశ్మీర్‌పై కూడా సెన్సేషనల్ ప్రకటన ఏదైనా చెయ్యబోతోందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.