కాశ్మీర్లో మళ్ళీ ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు

| Edited By: Anil kumar poka

Feb 09, 2020 | 5:28 PM

జమ్మూ కాశ్మీర్లో 2 జీ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గత నెలలో వీటిని పునరుధ్ధరించిన విషయం గమనార్హం. పార్లమెంటుపై దాడి కేసు దోషి  అఫ్జల్ గురు మృతి చెందిన రోజును పురస్కరించుకుని జెకెఎల్ఎఫ్ నాయకులు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. 2013 ఫిబ్రవరి 9 న అఫ్జల్ గురును ఉరి తీసిన సంగతి విదితమే. శ్రీనగర్ లోని వివిధ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించినట్టు అధికారులు […]

కాశ్మీర్లో మళ్ళీ ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు
Follow us on

జమ్మూ కాశ్మీర్లో 2 జీ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గత నెలలో వీటిని పునరుధ్ధరించిన విషయం గమనార్హం. పార్లమెంటుపై దాడి కేసు దోషి  అఫ్జల్ గురు మృతి చెందిన రోజును పురస్కరించుకుని జెకెఎల్ఎఫ్ నాయకులు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. 2013 ఫిబ్రవరి 9 న అఫ్జల్ గురును ఉరి తీసిన సంగతి విదితమే. శ్రీనగర్ లోని వివిధ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించినట్టు అధికారులు తెలిపారు. అఫ్జల్ ఉరికి నిరసనగా ఈ నెల 9 న, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (ఎన్ ఎల్ ఎఫ్)  వ్యవస్థాపకుడు మక్బుల్ భట్ మృతికి సంతాపంగా ఈ నెల 11 న బంద్ పాటించాలని జేకేఎల్ఎఫ్ నేతలు పిలుపునిచ్చారు.  ఈ పిలుపు మేరకు ఆదివారం శ్రీనగర్లో పలు చోట్ల షాపులు, మార్కెట్లు మూసివేశారు. అయితే జేకేఎల్ఎఫ్ నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కీలక ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు.